ఈ మధ్యన తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవటం.. ఆయనతో పలు విషయాల్ని చర్చించేందుకు వీలుగా ఆయనతో భేటీ అయ్యారు సీనియర్ నటుడు.. కమ్ కమేడియన్ ఆలీ. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో చాలామంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వారికి భిన్నంగా ఆలీ మాత్రం ఓపెన్ గా బయటకు రావటమే కాదు.. తన మిత్రుడు పవన్ కల్యాణ్ కు హ్యాండిచ్చి మరీ జగన్ పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేయటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల సినీ ప్రముఖుల్ని చర్చలు జరిపేందుకు ఏపీ సీఎం జగన్ ఆహ్వానించిన కార్యక్రమంలో ఎవరూ అంచనా వేయని రీతిలో ఆలీని సీన్లోకి దించటాన్ని చాలా మంది జీర్ణించుకోలేని పరిస్థితి. ఇక.. ఆలీకి మంచి శుభవార్త త్వరలోనే ఉంటుందని సీఎం జగన్ చెప్పారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ ను భేటీ అయి బయటకు వచ్చిన ఆలీ మీద ఒక దుర్మార్గమైన ప్రచారం సాగుతోంది.
అదేమంటే.. ఆలీని వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా నియమించినట్లుగా పేర్కొంటూ ఒక వార్త వైరల్ కావటం.. జగన్ తాను అనుకున్నట్లే ఆలీకి పదవిని అప్పజెప్పారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. ఇలాంటిది నిజం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వక్ఫ్ బోర్డుకు ఛైర్మన్ గా ఎంపిక చేయాలంటే ఒక ప్రోసీజర్ ఉందని.. అప్పుడు మాత్రమే పదవి లభించే వీలుందని చెబుతున్నారు.
ఇప్పుడున్న నిబంధనల ప్రకారం చూస్తే.. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత.. ఆ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను నెల రోజుల పాటు నోటీస్ బోర్డులో పెడతారు. అనంతరం వారికి వక్ఫ్ బోర్డు పదవిని అప్పగిస్తారని చెబుతున్నారు.
అయితే.. ఈ వాదన కూడా నిజం కాదంటున్నారు. అన్నింటికంటే కీలకమైన అంశం.. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా ఎంపిక చేయటానికి ముందు.. వక్ఫ్ బోర్డులో సభ్యుడై ఉండాలని చెబుతున్నారు. ఈ మధ్యనే వక్ఫ్ బోర్డు నియామకం జరిగింది. అందులో అలీకి చోటు లభించలేదు. అంటే.. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా ఎంపిక చేయటానికి సైతం అవకాశం లేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డు సభ్యుల మీద ఫిర్యాదులు రావటంతో.. కేసులు కూడా నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ వ్యవహారం ఆడ్మిట్ దశ కూడా దాటలేదు. ఇలాంటి వేళలో.. ఏ మాత్రం సంబంధం లేని ఆలీకి వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవిని సీఎం జగన్ అప్పగించారన్న వార్తలో ఏ మాత్రం నిజం లేదు. ఇప్పటికి ఆ ప్రచారాన్ని ఎవరైనా చేస్తుంటే.. అదంతా ఉత్త అబద్ధమంటూ రూల్ పొజిషన్ చెప్పటం మంచిది. అప్పటికైనా ఈ విష ప్రచారానికి అడ్డుకట్ట పడే వీలుందని చెప్పక తప్పదు.