వేదిక మీద అన్న ఒక్కడే...?

Update: 2022-04-08 11:30 GMT
అవును. వేదిక మీద జగనన్న ఒక్కడే కనిపించారు. మురిపించారు. ఆయనే మైక్ అందుకుని మాట్లాడారు. అధికారులు మాత్రమే ఉన్నారు. ఇదంతా జరిగింది నంద్యాల సభలో. జగనన్న వసతి దీవెన పధకం కింద పంపిణీ చేసే కార్యక్రమంలో జగన్ మాత్రమే పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో కొత్త జిల్లా నంద్యాలకు వచ్చారు.

ఇక జగన్ కి పార్టీ నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. అయితే జగనన్న వసతి దీవెన కార్యక్రమం అంటే సంబంధిత మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొనాలి.

కానీ ఆయన మాజీ అయిపోయారు. ఇక జిల్లాకు చెందిన ఇంచార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం మాజీ కావడంతో రాలేకపోయారు.

దాంతో జగన్ మాత్రమే సభా వేదిక ఎక్కారు, ప్రసంగం చేశారు. ఈ విధంగా జరగడం అంటే ఒక రాజకీయ ముచ్చటగానే చెప్పుకోవాలి. ఎపుడూ జిల్లా మంత్రులు, ఇంచార్జి మంత్రితో పాటు, సంబంధిత మంత్రులతో సభలు సందడిగా ఉంటాయి. కానీ నంద్యాల సభ మాత్రం దానికి భిన్నంగా సాగింది.

దాంతో మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా జగనే  అంతా అన్నట్లుగానే సభ సాగిపోయింది. ఏపీకి మంత్రులు లేని లోటు అలా కనిపించింది. మరో మూడు రోజుల పాటు ఇదే విధంగా ఉంటుంది. కొత్త మంత్రులు వస్తేనే మళ్లీ కళకళలాడాయి సభలు.

ఇక కొత్త మోజులో కొందరు జోరు చూపిస్తే ఆ హడావుడి మరిన్నాళ్ళు సాగే వీలుంది. మొత్తానికి అన్న అంటే అదే మరి అన్నట్లుగా జగన్ నంద్యాల మీటింగ్ సాగిపోయింది.
Tags:    

Similar News