స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు

Update: 2020-12-19 04:00 GMT
ఏపీ కేబినెట్ భేటిలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. మంత్రులతో ఈ మేరకు సీఎం అన్న మాటలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలకు మంచి అవకాశం వచ్చిందని సీఎం జగన్ అన్నట్టు తెలిసింది. ఈనెల 25 నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని.. దీన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఎమ్మెల్యే, మంత్రి ఉపయోగించుకోవాలని సీఎం జగన్ సూచించినట్టు తెలిసింది. ప్రతి ఊరికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వెళ్లి పట్టాలు అందజేయాలని జగన్ ఆదేశించారు. స్థానిక సంస్తల ఎన్నికల ముందు గ్రామాల్లో ఎమ్మెల్యేలు ప్రచారం చేసేందుకు ఇదో మంచి అవకాశమని సీఎం వ్యాఖ్యానించారు.

ఇక ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు భూములు చదును చేసేందుకు వస్తున్న ట్రాక్టర్లు , వాహనాలను ఎస్ఈబీ అధికారులు ఆపేస్తున్నారని మంత్రులు ఈ భేటిలో సీఎంకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ పనికోసమే మట్టి తీసుకెళుతున్నాం అన్నా వినిపించుకోవడం లేదని విన్నవించారు. కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని తెలిసింది.

రేషన్ కార్డుల తొలగింపుపై మంత్రులు జగన్ కు ఫిర్యాదు చేయగా.. అర్హులకు అందించాలని అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ బీమా డబ్బులు వారం రోజుల్లో ఖాతాల్లోకి జమ చేయాలని బ్యాంకర్లకు చెప్పాలని ఆర్థిక శాఖను జగన్ ఆదేశించారు.
Tags:    

Similar News