జ‌గ‌న్ న‌యా స్ట్రాట‌జీ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేనా..!

Update: 2023-04-08 09:14 GMT
ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ ప్ర‌భుత్వం తాము చేసింది చెప్పుకొనేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. సంక్షేమ ప్ర‌భు త్వం ఏర్పాటు చేశామ‌ని.. ప్ర‌తి ఒక్క లబ్ధిదారు కుటుంబానికి సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని గ‌డ‌ప గ‌డ‌ప‌కు కూడా ఆయ‌న వివ‌రిస్తున్నారు. ఎమ్మెల్యే లు, మంత్రుల‌ను కూడా ముందుండి న‌డిపించారు. అయితే.. ప్ర‌తిప‌క్షాలు దూకుడు పెంచాయి. ఇత‌ర విష‌యాల‌ను తెర‌మీద‌కి తెచ్చాయి.

ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం కూడా మ‌నం చూశాం. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా జ‌గ‌న్ కూడా ప్లేట్ ఫిరాయించారు. త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న‌దే కాకుండా.. గ‌త ప్ర‌భుత్వం ఏం చేసిందో కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తూ.. వినూత్న కార్య‌క్ర‌మానికి తెర‌దీశారు.

దీనివ‌ల్ల‌.. ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం లోటు పాట్లు.. గ‌త ప్ర‌భుత్వం ఏం చేసింద‌నేది కూడా చ‌ర్చ‌కు వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇది.. ప్ర‌తిప‌క్షాల‌కు ఇబ్బంది క‌లిగించే వ్య‌వ‌హార‌మ‌ని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన ప్ర‌చారం ఎలా ఉన్నా.. ఇక నుంచి ఎన్నిక‌ల స‌మ‌యానికి గ‌త ప్ర‌భుత్వంతో లింకు పెడుతూ.. వైసీపీ ప్ర‌ద‌ర్శించే దూకు డును త‌ట్టుకోవ‌డం.. ప్ర‌తిప‌క్షాల‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. పైగా.. వ‌లంటీర్లు, గృహ‌సార‌థులు, ఇంచార్జులు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఇలా.. అన్ని వ‌ర్గాల‌ను సీఎం జ‌గ‌న్ రంగంలోకి దింపుతున్నారు.

దీంతో ఊరూ వాడా కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా గ‌త ప్ర‌భుత్వానికి- ప్ర‌స్తుతం ప్ర‌భుత్వానికి పాల‌న‌లో ఉన్న తేడాల‌ను వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తే.. ఇది ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు వెళ్తే.. అంతిమంగా వైసీపీ పుంజుకుంటుంద ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

ప్ర‌ధానంగా చూసే విష‌యాలు ప‌రిశీలిస్తే.. అవినీతి, ప‌థ‌కాలు, నిధుల వినియోగం, ఎమ్మెల్యేల ప‌నితీరు వంటివాటిని వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. మ‌రి దీనిని ప్ర‌తిప‌క్షాలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News