జ‌గ‌న్ మాట‌తో గేమ్ మొత్తం మారిపోయింది

Update: 2018-02-19 05:08 GMT
ఏపీ రాజ‌కీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎత్తులు.. ఆపై ఎత్తుల‌తో రాజ‌కీయ పార్టీల‌న్నీ హ‌డావుడిగా ఉన్నాయి. ఒకరికి మించిన మ‌రొక‌రు వ్యూహాలు అమ‌లు చేస్తుండ‌టంతో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం హాట్ హాట్ గా మారింది. కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌వేశ‌పెట్టి చిట్ట‌చివ‌రి పూర్తిస్థాయి బ‌డ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించ‌క‌పోవ‌టం.. విభ‌జ‌న నాటి హామీల్ని నెర‌వేర్చేలా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోక‌పోవ‌టంతో ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతో.. ఏపీకి జ‌రిగిన విభ‌జ‌న న‌ష్టంపై చ‌ర్చ మొద‌లైంది.

ఈ క్ర‌మంలో కేంద్రం తీరుపై నిర‌స‌న‌ల‌తో మొద‌లై.. చివ‌ర‌కు రాజీనామాల వ‌ర‌కూ వ‌చ్చింది. రాజీనామాల‌తో ఎలాంటి ఉప‌యోగం లేద‌ని.. ఇది కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌న‌మే త‌ప్పించి.. మోడీని ముప్ప‌తిప్ప‌లు పెట్టే వ్య‌వ‌హారం కాదంటూ ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేసిన వేళ‌.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు షాక్ ఇచ్చే ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీ ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి త‌మ‌కింకేమీ ముఖ్యం కాద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌ట‌మే కాదు.. మోడీ ప్రాప‌కం కోసం పాకులాడేది మీరే త‌ప్పించి.. తాము కాద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసేలా జ‌గ‌న్ అవిశ్వాస అంశాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు.

మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానానికి తాము సిద్ధ‌మ‌ని.. ఆ ప్ర‌య‌త్నానికి స‌హ‌క‌రిస్తారా? అంటూ జ‌గ‌న్ విసిరిన స‌వాల్ బాబు అండ్ కోకు మింగాలేని.. క‌క్కాలేని ప‌రిస్థితిని తీసుకొచ్చింద‌ని చెప్పాలి. ఎప్పుడూ త‌న‌దే పైచేయిలా ఉండాల‌న్న‌ట్లుగా వ్యూహాలు సిద్దం చేసే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.. తాజా ప‌రిణామం షాకింగ్ గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.

రాజీనామా చేయ‌టానికి చెప్పిన గ‌డువుకు చాలా టైముంది. అదే స‌మ‌యంలో రాజీనామాల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నం అంతంతే. కానీ.. అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌టం ద్వారా.. ఆ అంశంపై చ‌ర్చ జ‌రిగే వీలుంది. ఆ టైంలో మోడీ ప్ర‌భుత్వ త‌ప్పుల్ని ఎవ‌రు స‌మ‌ర్థంగా ఎత్తి చూపుతార‌న్న విష‌యం ప‌దికోట్ల తెలుగువారికి అర్థం కావ‌ట‌మే కాదు.. ఏపీ ప్ర‌జ‌ల హ‌క్కుల మీద‌.. వారి ఆకాంక్ష‌ల మీద ఎవ‌రికెంత క‌మిట్ మెంట్ ఉంద‌న్న విష‌యం అర్థం కావ‌టం ఖాయం.

అంతేనా.. అవిశ్వాస తీర్మానం చ‌ర్చ రూపంలోకి రావాలంటే 54 మంది ఎంపీల మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఇప్పుడున్న దాని ప్ర‌కారం జ‌గ‌న్ కు ఉన్న ఎంపీలు ఐదుగురు మాత్ర‌మే. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో జ‌గ‌న్ ఎంపీలు ప‌లువురిని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు త‌న బుట్ట‌లో వేసుకోవ‌టంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఏపీలో అన్ని పార్టీల‌కు క‌లిపి 25 మంది ఎంపీలు ఉన్నారు.

మ‌రి.. మోడీ ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఏపీకి ఉన్న ఎంపీల‌కు రెట్టింపు ఎంపీల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌వుతుంది. మ‌రి.. దీనికి క‌లిసి వ‌చ్చే వారు ఎవ‌ర‌న్న‌ది ప్ర‌శ్న‌. ఆ దిశ‌గా ప‌వ‌ర్ లో ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎంత‌మేర వ‌ర్క్ చేస్తార‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. జ‌గ‌న్ పిలుపున‌కు స్పందించి మోడీ స‌ర్కారుపై అవిశ్వాసానికి ఓకే చెప్పి ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకుంటారా?  లేక‌.. జ‌గ‌న్ పిలుపును ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్లుగా ఉండిపోతారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. అవిశ్వాసానికి బాబు ఓకే చెబితే..జ‌గ‌న్ బాట‌లోకి బాబు రావాల్సిందే. ఒక‌వేళ‌.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే.. జ‌నం బాట నుంచి బాబు దూర‌మైపోతారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ పిలుపు ఇచ్చిన‌ట్లుగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం అంద‌రూ క‌లిసి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంది. నిత్యం.. త‌న పార్టీ మైలేజీ కోసం త‌పించే బాబుకు.. జ‌గ‌న్ బాట‌లో న‌డ‌వాల్సి రావ‌టం క‌ష్టంగా ఉండ‌టం ఖాయం. జ‌గ‌న్ వ్యూహ చ‌తుర‌త‌తో ఇప్పుడా ప‌రిస్థితిని త‌ప్పించుకోలేని ప‌రిస్థితుల్లోకి బాబు వెళ్లిపోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News