ఈడీ కేసులో, సీబీఐ కేసులో ఈరోజున (జనవరి 31) కోర్టుకు తప్పని సరిగా హాజరు కావాలని... ముఖ్యమంత్రి జగన్ ను సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే... ఈరోజు జగన్ కోర్టుకు హాజరుకాలేదు. నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు అనంతరం జగన్ తరఫు న్యాయవాదులు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ హై కోర్టులో కేసు వేశారు. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటరు దాఖలు చేయమని సీబీఐ కోర్టును కోరింది. హైకోర్టు లో కేసు పెండింగ్ లో ఉండటం ఈరోజు జగన్ గైర్హాజరు కు కారణం కావచ్చు.
ఇదిలా ఉండగా... ముఖ్యమంత్రి హోదాలో ఉండటం, అనేక పాలన బాధ్యతలు నిర్వర్తించి ఉండాల్సిన కారణం వల్ల వ్యక్తిగతం గా కోర్టుకు హాజరు కాలేనని జగన్ హైకోర్టు లో పిటిషను వేశారు. సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరు తప్పనిసరి అని చెప్పే ముందు మా వాదన పూర్తిగా పరిగణ లోకి తీసుకోలేదని జగన్ పిటిషనులో పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం స్వయంగా కోెర్టుకు రావాలంటే... అది పరిపాలన బాధ్యతలకు అడ్డంకిగా మారుతుందని... దీనిని పరిగణ లోకి తీసుకోవాలని జగన్ కోరారు.
హైకోర్టు ఈ విచారణ ను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఆరోజు గురువారం. విచారణలో హైకోర్టు తీర్పును బట్టి ఫిబ్రవరి 7 శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్లాలా వద్దా అని తేలే అవకాశం ఉంది. హైకోర్టు కనుక వ్యక్తిగత హాజరు తప్పనిసరి అంటే మరుసటి రోజే జగన్ కోర్టుకు హాజరు కాకతప్పదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆ తీర్పును సవాల్ చేయడానికి తగినంత సమయం కూడా ఉండదు.