ఏపీ అసెంబ్లీలో ఒక సన్నివేశం తరచూ కనిపిస్తుంటుంది. వైఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో తీసుకున్న ఏ విషయాన్ని ప్రస్తావించినా.. వెనువెంటనే ఒంటికాలి మీద లేచే విపక్ష నేత వైఎస్ జగన్.. ‘‘ఆ ప్రియతమ నాయకుడు.. దివంగత మహానేత వైఎస్...’’ అంటూ నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటారు. చూస్తూ.. చూస్తూ తన తండ్రిపై విమర్శలు చేస్తే.. కొడుగ్గా ఆ మాత్రం చెలరేగిపోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. వాస్తవంగా మాట్లాడుకుంటే.. రాజకీయంగా అనివార్యం కూడా.
ఏపీ అసెంబ్లీలోనూ.. ఏపీ అధికారపక్షంపైనా మీడియాతో మాట్లాడే సందర్భంగా తన తండ్రి మీద వచ్చే ఆరోపణల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడే జగన్.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తుంది. ఆదివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. తన ప్రసంగంలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో నాటి వైఎస్ పాలన మీద ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు భారీ అన్యాయం జరిగిందని.. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా వైఎస్ నిర్ణయాలు తీసుకుంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కనీసం నోరు కూడా విప్పలేదని.. వైఎస్ ను నెత్తిన పెట్టుకున్నారంటూ విమర్శలతో ఉతికి పారేశారు.
ఏపీ ప్రయోజనాలు తప్పించి.. తెలంగాణప్రజల ప్రయోజనాలు ఏమాత్రం పట్టలేదని.. పోతిరెడ్డిపాడుతో సహా పలు ప్రాజెక్టుల విషయంలో నాటి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ తెలంగాణ వ్యతిరేక ధోరణిని ప్రదర్శించినట్లుగా తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ రాజకీయ వారసుడిగా వ్యవహరిస్తున్న జగన్.. తన తండ్రి మీద తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఘాటు విమర్శలపై ఎందుకు స్పందించలేదన్నది ఆసక్తికరంగా మారింది. మరుసటి రోజు జగన్ పత్రికలోనూ కేసీఆర్ ను పల్లెత్తు మాటనలేదు.
ఆ దివంగత మహానేత అంటూ తండ్రి మీద విపరీతమైన ప్రేమను ప్రదర్శించే జగన్.. కేసీఆర్ ఉతికే విమర్శల ఉతుకుడుపై ఎందుకు రియాక్ట్ కావటం లేదు? తన తండ్రిని ఏపీ ముఖ్యమంత్రి విమర్శిస్తే తట్టుకోలేని జగన్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు విమర్శలు చేసినా లైట్ తీసుకోవటం ఏమిటో అర్థం కాని పరిస్థితి. వైఎస్ మీద చంద్రబాబు విమర్శలు చేయకూడదు కానీ కేసీఆర్ చేయొచ్చా అన్న ప్రశ్న జోరుగా వినిపిస్తోంది. దీనికి జగన్ సమాధానం చెబుతారా..?