ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి భిన్నమన్న విషయం తెలిసిందే. కొన్ని అంశాల మీద అవసరానికి మించిన ఆవేశాన్ని ప్రదర్శించే జగన్.. మరికొన్ని అంశాల్ని అస్సలు పట్టనట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది. ఏపీ అధికారపక్షం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడే జగన్.. తెలంగాణలో తన పార్టీ తెలంగాణ అధికారపక్షంలో విలీనం కావటం మీద ఒక్కమాట అంటే ఒక్క మాట రాకపోవటం గమనార్హం.
తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. చివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం తెలంగాణ అధికారపక్షంలోకి చేరిపోయినా ఎలాంటి స్పందన లేకుండా ఉండటం జగన్ కు మాత్రమే చెల్లుతుందేమో..? కొన్ని పరిమితులతో కొంతమంది మీద అంత త్వరగా విమర్శలు చేసే అవకాశం లేకపోవచ్చు. కానీ.. తెలంగాణలో తన పార్టీ ఉనికిని ప్రశ్నించేలా పరిణామాలు చోటు చేసుకున్నా అసలేమీ జరగనట్లుగా ఉండటం జగన్ కు మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారంగా చెప్పక తప్పదు.
గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వదిలిపెట్టి తెలంగాణ అధికారపక్షంలో భాగస్వామ్యం అయినప్పుడు కామ్ గా ఉన్న జగన్.. తాజాగా ఒక ఎంపీ కమ్ రాష్ట్ర అధ్యక్షుడు.. మరో ఎమ్మెల్యే కారు ఎక్కేసినా ఆయన నోట ఖండన మాటో.. తెలంగాణ అధికారపక్షం అనుసరించిన వైఖరిని తప్పు పట్టటం లాంటివి మాట వరసకు ఉండకపోవటం చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఒక్కమాట అనటానికి సైతం జగన్ ఎంతో ఆలోచిస్తారన్న భావన కలగటం ఖాయం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఒంటికాలి మీద ఎగిరిపడే జగన్.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ విషయానికి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించటమే కాదు.. తనను తీవ్రంగా దెబ్బ తీసినా మౌనంగా మిన్నకుండిపోవటమే తప్పించి.. ‘శోచనీయం’ తరహాలో కూడా మాట అనకపోవటం జగన్ లాంటి అధినేతకు మాత్రమే సాధ్యమవుతుందేమో..? తమ అధినేత పేరులోనే ‘గన్’ ఉందని.. తన రాజకీయ ప్రత్యర్థుల మీద చెలరేగిపోతారని గొప్పలు చెప్పుకునే జగన్ పార్టీ నేతలు.. తెలంగాణ రాష్ట్ర అధికారపక్షంలో తమ పార్టీ విలీనం కావటంపై జగన్ నోరు ఎందుకు విప్పలేదన్న మాటకు మాత్రం సమాధానం చెప్పలేకపోవటం విశేషం. ఇంతకీ కేసీఆర్ అంటే జగన్ కు అంత భయమేంటి చెప్మా..?