ప్ర‌త్య‌ర్థుల‌కు నోట మాట రాకుండా చేసిన జ‌గ‌న్‌!

Update: 2019-06-08 07:00 GMT
బుర‌ద జ‌ల్లే బ్యాచ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. చారిత్ర‌క విజ‌యం అనంత‌రం.. తాను తీసుకుంటున్న నిర్ణ‌యాల విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరు ప్ర‌త్య‌ర్థుల‌కు నోట మాట రాకుండా చేస్తోంద‌ట‌. అధికారుల ఎంపిక మొద‌లు.. మంత్రివ‌ర్గం కూర్పు వ‌ర‌కూ  జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

జ‌గ‌న్ అధికారంలోకి రావ‌టం మొద‌లు రెడ్ల‌కు ప్రాధాన్య‌త భారీగా ఉంటుంద‌ని.. ఎక్క‌డ చూసినా రెడ్ల‌కు ప‌ద‌వుల పందేరం చేస్తార‌న్న ప్ర‌చారం సాగింది. అయితే.. అలాంటిదేమీ లేకుండా జ‌గ‌న్ తాజా మంత్రివ‌ర్గాన్ని చూస్తున్న వారు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌రకూ అధినేత‌లంతా సామాజిక న్యాయాన్ని మాట్లాడ‌ట‌మే కానీ చేత‌ల్లో చేసి చూపించింది లేదు.

అందుకు భిన్నంగా జ‌గ‌న్ కేబినెట్ కూర్పు భిన్నంగా ఉండ‌ట‌మే కాదు.. రెడ్ల‌కు అతి త‌క్కువ ప‌ద‌వులు ఇచ్చిన వైనం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది. కాబినెట్ కూర్పు అనంత‌రం.. రెడ్ల‌కు భారీ ప్రాధాన్యం ఇచ్చిన వెంట‌నే జ‌గ‌న్ మీద బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని భావించిన ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌కు ఇప్పుడు నోట మాట రావ‌టం లేదు.

మొత్తం పాతిక మంత్రి మంత్రుల్లో కేవ‌లం న‌లుగురు రెడ్ల‌కు మాత్ర‌మే ప‌ద‌వులు ఇస్తూ జ‌గ‌న్ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారులు కానీ.. మ‌రెవ‌రైనా కానీ జ‌గ‌న్ ను క‌లిసినంత‌నే.. అదేదో పెద్ద త‌ప్పు అన్న‌ట్లుగా కొన్ని మీడియాల‌లో క‌థ‌నాలు వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాలో సైతం.. జ‌గ‌న్ నిర్ణ‌యాల్లో రెడ్డి యాంగిల్ ను వెతికే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. స‌మ‌ర్థ‌త‌కు పెద్ద పీట వేయ‌టంతోపాటు.. అన్ని వ‌ర్గాల్ని క‌లుపుకు వెళ్ల‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్న‌ట్లుగా జ‌గ‌న్ తీరు ఉంద‌ని చెప్పాలి. ఆ విష‌యం తాజా మంత్రివ‌ర్గం ఎంపిక‌తో జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. సొంత సామాజిక వ‌ర్గాన్ని సైతం తూకం ప్ర‌కార‌మే త‌ప్పించి.. అన‌వ‌స‌ర ప్రాధాన్య‌త ఇవ్వ‌న‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ తాజా నిర్ణ‌యాల‌తో స్ప‌ష్ట‌మ‌వుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News