వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఏపీలో జిల్లాల విభజన అంశం ఊపందుకుంది. తాము అధికారంలోకి వస్తే జిల్లాల విభజన చేపడతామని జగన్ ఇది వరకే ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆ అంశం మీద దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ క్రమంలో జిల్లాల విభజన అంశం గురించి కసరత్తు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ అంశంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక హామీని ప్రస్తావించుకుని తీరాలి. అదే ఎన్టీఆర్ పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయడం. తాము అధికారంలోకి వస్తే ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టనున్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు పేరు మారుస్తారని ప్రచారం జరిగింది. అయితే అలా కాదని - జిల్లాల విభజన తర్వాతే ఎన్టీఆర్ పేరు మీద ఒక జిల్లా ఏర్పడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది.
కృష్ణా జిల్లాను రెండుగా విభజించి ఒక ఒకదానికి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయవచ్చనే అంచనాలున్నాయి. అందులోనూ కృష్ణా జిల్లా ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు కూడా బాగా దక్కాయి. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.