రాజ్యసభ ఉపాధ్యక్షుని ఎన్నిక సమయంలో వైఎస్ ఆర్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సర్వాత్ర ప్రశంసలు అందుతున్నాయి. రాజ్యసభలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఉపాధ్యక్ష అభ్యర్దిని గెలిపించే ఓట్లూ లేవు అలాగని ఓడించే సామర్ధ్యమూ లేదు. ఇలాంటి సమయంలో ఎవరో ఒకరివైపు మొగ్గు చూపించడం అనవసరపు చర్య. ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్దంగా ఉండడం రాజకీయ పరిణితి. దానినే చూపించారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షడు జగన్ మోహాన రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు అనేక అన్యాయాలు చేసిన, చేస్తున్న భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చిన అభ్యర్దికి ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అలాగని కాంగ్రెస్ పార్టీ అభ్యర్దికి ఓటు వేస్తే రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన పార్టీకి ఓటేసినట్టు అవుతుంది. ఈ రెండూ కాకుండ తటస్దంగా ఉంటే ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందన్నదీ జగన్ వ్యూహం.
కాంగ్రెస్ ఓటేసిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు తలదించుకునే స్థితికి వచ్చింది. కర్ణాటకలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ఒక్కటయ్యారు. ఇప్పుడు రాజ్యసభలో జరిగిన ఉపాధ్యక్ష ఎన్నిక ద్వారా వారిద్దరి స్నేహం మరింత బలపడంది. ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు కావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపిన వైనాన్ని జగన్ ఏపీ ప్రజల ముందు ఉంచవచ్చు. దీనినే ప్రధాన అస్త్రంగా మలచుకుని చంద్రబాబు నాయుడిపై ఎదురదాడి చేయావచ్చు. దీనికి ప్రజల నుంచి కూడా జగన్ కు మద్దతు ఉంటుంది. మరోవైపు తాను బీజేపీ మనిషినంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలకు ఘాటైన సమాధానం చెప్పినట్టు కూడా ఉంటుంది. ఎందుకూ ఉపయోగపడని ఒకటి రెండు ఓట్లతో అనవసరపు వివాదలను కొనితెచ్చుకున్నట్లు ఉంటుంది. ఇవన్నీ ఆలోచించిన మీదటే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు అంటున్నారు.