ఫైబ‌ర్ గ్రిడ్‌ లో టీడీపీ లీల‌లు..జ‌గ‌న్‌ కే దిమ్మ‌తిరిగిపోయిందిగా..!

Update: 2019-07-31 07:41 GMT
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన  అవినీతి - అక్రమాలను ఒక్కొక్కటే బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి నుంచి రాజ‌ధాని అమరావ... బాబు అమెరికా పర్యటనలో వరకు ప్రతి దాని వెనక కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయ‌న్న విషయం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు చాలా గొప్ప‌గా చెప్పుకున్న ఫైబ‌ర్ గ్రిడ్ ప్రాజెక్టు విష‌యంలో తెలుగు త‌మ్ముళ్లు చేసిన అవినీతిపై ఇప్పుడు జ‌గ‌న్ జూలు విద‌ల్చ‌నున్నారు.

బాబు ఫైబ‌ర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇంటింటికి నెట్ - టీవీ క‌నెక్ష‌న్‌ - ఫోన్ అంటూ ఓ రేంజులో ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేశారు. దీని ప్ర‌చారానికే కోట్లాది రూపాయ‌లు మంచినీళ్లలా ఖ‌ర్చు చేశారు. ఈ ప్రాజెక్టులో సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్ల నుంచి ఎమ్మెస్వోల ఎంపిక వ‌ర‌కు అన్నింట్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌న్న‌ది నిజం. అయితే దీనిపై అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ వాళ్లు అరిచి గీపెట్టినా ప‌ట్టించుకున్న వాళ్లు లేరు.

ఇప్పుడు ప్ర‌భుత్వం మారింది. దీంతో బాబు పాల‌న‌ను అడ్డం పెట్టుకుని ఫైబ‌ర్ గ్రిడ్ ప్రాజెక్టులో భారీగా అవినీతికి పాల్ప‌డిన తెలుగు త‌మ్ముళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఎమ్మెస్వోలు మొత్తం టీడీపీ వాళ్లే ఉన్నారు. వాళ్లు ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర నుంచి వ‌సూలు చేసిన సొమ్మంతా మింగేశారు. ఇప్పుడు ప్ర‌భుత్వం మార‌డంతో క‌ట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇదే అంశంపై కొద్ది రోజులుగా ఐటీ మంత్రి మేక‌పాటి ద‌గ్గ‌ర పంచాయితీ కూడా జ‌రిగింద‌ట‌.

ఎంతో కొంత ఇస్తాం.... మ‌మ్మ‌ల‌ను త‌ప్పించ‌వ‌ద్ద‌ని... మేమే ఎమ్మెస్వోలుగా కొన‌సాగుతామ‌ని వేడుకున్నార‌ట‌. చివ‌ర‌కు వ్య‌వ‌హారం జ‌గ‌న్ వ‌ద్ద‌కు చేర‌డంతో నెల రోజులుగా ఈ విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా త‌న‌కు వ‌ర‌కు ఎందుకు తేలేద‌ని... ఇప్ప‌టికి అయినా వెంట‌నే విచార‌ణ జ‌రిపించాల‌ని మంత్రిని చిన్న‌పాటి వార్నింగ్ కూడా ఇచ్చార‌ట‌. చివ‌ర‌కు ఏపీ అసెంబ్లీ చివ‌రి రోజు చ‌ర్చంతా దీనిపైనే న‌డిచింది. ఈ స్కామ్ పూర్తి వివ‌రాలు తెలుసుకున్న జ‌గ‌న్ షాక్ తిన్న‌ట్టు కూడా తెలిసింది.

బ‌కాయిలు క‌ట్ట‌క‌పోతే  క్రిమిన‌ల్ చర్చ‌లు త‌ప్ప‌వ‌ని ఎమ్మెస్వోల‌కు వార్నింగ్ ఇవ్వ‌డంతో ఎమ్మెస్వోల సంఘం నాయకులు బిక్కమొఖంతో వెనుదిరిగారు. వాస్త‌వానికి అప్ప‌ట్లోనే చైనా నుంచి నాసిర‌కం సెట్ టాప్ బాక్సులు వ‌చ్చాయ‌న్న ఆరోప‌ణ‌లు తీవ్రంగా వ‌చ్చాయి. ఐదేళ్ల బాబు పాల‌న‌లో ఏ ఒక్క అవినీతి - అక్ర‌మాల‌ను వ‌ద‌ల‌ని జ‌గ‌న్ చివ‌ర‌కు చంద్ర‌బాబు టైంలో వ‌చ్చిన ఫైబ‌ర్ గ్రిడ్ స్కామ్‌ ను కూడా పూర్తిగా బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌నున్నారు.


Tags:    

Similar News