బాబుకు జ‌గ‌న్ ప‌వ‌ర్ ఫుల్ పంచ్ వేశారే!

Update: 2019-05-17 17:46 GMT
చంద్ర‌గిరిలో రీ పోలింగ్ వ్య‌వ‌హారం ఏపీలోని అధికార - విప‌క్షాల మ‌ధ్య యుద్ధాన్నే త‌లపిస్తోంది. అప్ర‌జాస్వామికంగా పోలింగ్ నాడు ద‌ళిత ఓట‌ర్ల‌ను ఓటేయ‌కుండా టీడీపీ అడ్డుకుంద‌ని ఆరోపించిన వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం రీ పోలింగ్ కు నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈ నిర్ణ‌యంపై వైసీపీలో హ‌ర్షం వ్య‌క్తం అవుతుండ‌గా - టీడీపీలో మాత్రం అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతోంది.

తాము కూడా రీపోలింగ్ కు విజ్ఞ‌ప్తి చేస్తే.. దానిని వ‌దిలేసి చాలా గ్యాప్ త‌ర్వాత వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం సానుకూలంగా స్పందిస్తారా? అంటూ టీడీపీ వాదులాట‌కు దిగింది. ఈ నేప‌థ్యంలో ఈసీపై చంద్ర‌బాబు పెద్ద యుద్ధ‌మే చేస్తున్నారు. చంద్ర‌బాబు తీరును ఎండ‌గడుతూ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌దైన శైలిలో తూర్పార‌బట్టారు. కాసేప‌టి క్రితం... ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన జ‌గ‌న్‌... చంద్ర‌బాబు తీరును ప్ర‌శ్నిస్తూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

*.@ncbnగారూ రీపోలింగ్‌ అప్రజాస్వామికమా?లేక రిగ్గింగా?  చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయటం అప్రజాస్వామికమా?లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డు పడటమా?రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు? అయిదు పోలింగ్‌ స్టేషన్ లలో రీపోలింగ్‌ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని కోరుతున్నా* అంటూ త‌న ట్వీట్ లో జ‌గ‌న్ పేర్కొన్నారు. మొత్తంగా ఈ ట్వీట్ ద్వారా చంద్ర‌బాబు తీరును ఎండ‌గ‌ట్ట‌డంతో పాటు రీ పోలింగ్ పై టీడీపీ చేస్తున్న‌దంతా రాద్ధాంత‌మేన‌ని కూడా జ‌గ‌న్ చెప్పినట్టైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఈ ట్వీట్ కు టీడీపీ ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News