ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారిని అరికట్టడానికి అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అహర్నిశలు కష్టపడుతుంది. ప్రస్తుతం దేశంలో ఒకరోజుకి ఎక్కువ నిర్దారణ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే కావడం గమనార్హం. ప్రతి రోజు మినిమమ్ 9 వేలకి పైగా టెస్టులు చేస్తుంది. ఇకపోతే , నేడు జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మాట్లాడుతూ .. “నేను ప్రతిసారీ చెప్తున్నాను నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే. మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించాం. పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను. అందుకే మీరే మా బలమని చెప్తున్నాను. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే’’ అని చెప్పారు. అలాగే, “డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, ఎస్పీలు కరోనా వైరస్ నివారణలో అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు.
ఇక క్షేత్ర స్థాయిలో గ్రామ వాలంటీర్లు, సచివాలయం, ఆశావర్కర్లు, ఏఎస్ లు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అంతా అద్భుతంగా పని చేశారన్నారు. మనం ఇప్పుడు నాలుగో విడత లాక్ డౌన్ లోకి అడుగుపెట్టాం అని, ఇంతకుముందు మనం అనుసరించిన పద్దతి వేరు. నాలుగో విడత లాక్ డౌన్ లో అనుసరిస్తున్న పద్దతి వేరు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది అని సీఎం తెలిపారు. అలాగే ఈ మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు.