కుటుంబ సభ్యులతో ఫారిన్ టూర్ ను ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత ఉల్లాసంగా గడిపారన్నది సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలే చెప్పేశాయి. టూర్ ముగించుకొని సాదాసీదాగా.. తన లగేజ్ ను తానే తెచ్చుకుంటూ ఎయిర్ పోర్ట్ లో వస్తున్న జగన్ ఫోటో సోషల్ మీడియాలో రావటంతో ఆయన ఫారిన్ నుంచి వచ్చేసిన విషయం తెలిసిపోయింది. ఇక్కడ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. జగన్ కు మధ్య ఓ పెద్ద వ్యత్యాసం ఉంది. విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన వెంటనే.. చంద్రబాబు మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు.
అందుకు జగన్ పూర్తి భిన్నం. ఇక.. బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడు.. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఆయన ఆస్తుల్ని తాత్కాలిక అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. రూ.749 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం వెలువడిన క్షణాల్లోనే జగన్ దృష్టికి ఈ విషయం వెళ్లిపోయింది. ఈ సమాచారం బయటకు వచ్చే సమయానికి ఆయన ఇఫ్తార్ విందులో ఉల్లాసంగా కనిపించారు.
అటాచ్ కు సంబంధించిన న్యూస్ ఆయన చెవిన పడిన వెంటనే.. ఆయన ముఖంలో రంగులు మారటంతో పాటు.. ఒక్కసారిగా ఆయన గంభీరంగా మారినట్లు చెబుతున్నారు. అప్పటి వరకూ హుషారుగా ఉన్న ఆయన ఒక్కసారిగా ఆయన బాడీ లాంగ్వేజ్ మారిపోవటంతో పాటు.. వెంటనే అక్కడ నుంచి వెళ్లేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియా.. ఈడీ నిర్ణయం మీద ఆయన స్పందన తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు.. ఇలాంటి చోట్ల స్పందించలేనంటూ ఆయన వెళ్లిపోయారు.
ఈడీ తాజా చర్య గురించి జగన్ కు ఏ మాత్రం ఉప్పందలేదన్నది తాజా పరిణామాల్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే.. ఈడీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఊహించలేకపోయారని చెబుతున్నారు. ఈడీ నిర్ణయం అనంతరం శుక్రవారం నుంచి ఉభయ గోదావరి జిల్లా.. గుంటూరు జిల్లా పర్యటల్ని క్యాన్సిల్ చేసుకోవటమే దీనికి నిదర్శనంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే తాజా ఎపిసోడ్ ఇష్యూలో జగన్ ఏ మాత్రం ఊహించకపోవటమే కాదు.. ఆయన రెఢీగా లేరన్న మాట ఆయన సన్నిహిత వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.