నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు పదవీ బాధ్యతలు చేపట్టి ఇటీవలే విపక్ష నేతగా మారిపోయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... రాష్ట్రానికి కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చేసిన తొలి రిక్వెస్ట్ కు సానుకూల ఫలితం రాలేదు. బాబు ఫస్ట్ రిక్వెస్ట్ ను జగన్ తిరస్కరించేశారు. ఆశ్చర్యం కలిగించే ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే... చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ప్రజా వేదికను ఇకపైనా తాను ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు ఇటీవలే జగన్ కు రిక్వెస్ట్ చేశారు. అయితే దీనిపై జగన్ సర్కారు ఇప్పటిదాకా స్పందించనే లేదు. అయితే తాజాగా కలెక్టర్ల సమావేశానికి సమయం ఆసన్నమైన వేళ.. బాబు రిక్వెస్ట్ ను తిరస్కరిస్తున్నట్లుగా జగన్ సర్కారు స్పష్టమైన సంకేతాలిచ్చేసింది.
ప్రజా వేదికలోనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను నిర్వహించాలని తీర్మానించిన జగన్ సర్కారు... ప్రజా వేదికలోని చంద్రబాబు - టీడీపీకి సంబంధించిన సామాగ్రిని తొలగించాలని టీడీపీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆదేశాలు జారీ చేసిన మరుక్షణమే అధికార యంత్రాంగం అక్కడ వాలిపోయింది. ఈ నెల 24న జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను ప్రజా వేదికలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రజా వేదికను ఖాళీ చేయాలని నేరుగా చెప్పకుండా... అక్కడి సామాగ్రిని తొలగించాలని చెప్పడంతోనే చంద్రబాబు రిక్వెస్ట్ ను జగన్ తిరస్కరించినట్టైందని చెప్పాలి. ఈ చర్యతో ప్రజా వేదికను చంద్రబాబుకు కేటాయించేందుకు జగన్ సర్కారు సుముఖంగా లేని కారణంగానే ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను అందులో పెడుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా చంద్రబాబు ఫస్ట్ రిక్వెస్ట్ నే జగన్ తిరస్కరించేశారన్న మాట.