తాజా నిర్ణయంతో ఏపీ రాజధాని అమరావతే..

Update: 2019-10-13 07:11 GMT
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏపీ రాజధాని అమరావతిపై జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అమరావతిని తరలిస్తారంటూ జరిగిన చర్చే కానీ సీఎం జగన్ మాత్రం ఎప్పుడూ అమరావతిని తరలిస్తామన్న మాట మాట్లాడింది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా అమరావతి సమీపంలోని మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఏకంగా రూ.1500 కోట్లు కేటాయించటం ఆసక్తికరంగా మారింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీ రాజధానిగా అమరావతినే కంటిన్యూ చేశారన్నది ఇప్పుడు చర్చగా మారింది.

మంగళగిరి ఆధునికీకరణలో భాగంగా ప్రభుత్వం రూ.1500 కోట్లుకేటాయించటంతో పాటు.. దీనికిసంబంధించిన ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేయటం గమనార్హం. మంగళగిరి.. దానికి పక్కనే ఉన్న తాడేపల్లి మండలాన్ని కలుపుకొని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ శాఖ పచ్చజెండా ఊపేసింది. దీంతో.. రాజధాని అమరాతి నుంచి తరలివెళ్లటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు దిశగా సమగ్ర ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడున్న దాని ప్రకారం పాతూరు.. కుంచనపల్లి.. వడ్డేశ్వరం మున్సిపాలిటీలు వేర్వేరుగా సాగుతున్నాయి. వీటిని కలిపేసి ఒకటిగా చేయటం.. భారీ ఎత్తున అభివృద్ధిని చేపట్టాలన్న ప్లాన్ చూస్తే.. ఏపీ రాజధానిగా అమరావతినే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News