ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ సర్కార్ సీరియస్

Update: 2021-04-19 04:33 GMT
ఒక మాజీ పోలీస్ బాస్.. ప్రభుత్వంతో ఢీకొంటే.. అది రిటైర్ అయ్యాక కూడా పంతం పడితే ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇప్పుడు ఆయనపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏవీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు జగన్ సర్కార్ రెడీ అయ్యింది.

ఎంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే అవినీతికి పాల్పడితే వదిలేది లేదని ఏపీ సీఎం జగన్ స్పష్టమైన హెచ్చరిక జారి చేసేందుకు సిద్ధమయ్యారు.ఈ చర్యతో ఇక ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల్లోనూ అవినీతి చేస్తే చర్యలు తప్పవన్న సంకేతాలను పంపిస్తున్నారు.

ఐపీఎస్ గా ఉంటూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఆయనపై అభియోగాలు మోపుతోంది.

కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ అనంతరం ఏబీవీ చేసిన కామెంట్లు, వైఎస్ వివేకా హత్యపై జగన్ సర్కార్ పై సీబీఐకి రాసిన లేఖ ఇతర అన్నింటిపై జగన్ సీరియస్ యాక్షన్ కు రెడీ అయ్యారు. 30 రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని ఆదేశించారు.

గత చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీవీ తన పదవీకాలంలో ఇజ్రాయెల్ కంపెనీ నుంచి భద్రతా సామగ్రిని సేకరించడంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గత ఏడాది జగన్ అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరి 8న సస్పెండ్ చేశారు. ఈ కేసును అవినీతి నిరోధక బ్యూరో(ఏసీబీ)కు అప్పగించిన జగన్ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్ మరియు పోలీసుల విధానాలను రావు ఉద్దేశపూర్వకంగా విదేశీ రక్షణ తయారీ సంస్థకు వెల్లడించారని ఆరోపించారు. ఫిబ్రవరి 13 న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో తన సస్పెన్షన్‌ను ఏబీ సవాలు చేశారు. కానీ క్యాట్ ఆయన పిటిషన్‌ను మార్చిలో కొట్టివేసింది. తరువాత, హైకోర్టును ఆశ్రయించాడు. ఏబీపై జూలైలో సస్పెన్షన్ ను హైకోర్టు రద్దు చేసింది. ఈ ఉత్తర్వును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ నవంబర్లో ఏబీపై సుప్రీంకోర్టు సస్పెన్షన్ పై ఉన్న స్టేను ఎత్తివేసింది. విచారణ ప్రస్తుతం పెండింగ్లో ఉంది.

ఈ క్రమంలో సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించారని మరోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.



Tags:    

Similar News