నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ !

Update: 2020-05-09 09:10 GMT
కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవానికి  ఎంతోమంది సామాన్యులు ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో  అలాంటివారి కోసం ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో సచివాలయాల్లో 16,208 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా సీఎం జగన్ జరిపిన సమీక్షలో అధికారులు జగన్ కు రాష్ట్రంలో 16,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సీఎం జగన్ పోస్టులను భర్తీ చేయాలని సూచించగా ఆగష్టు 31 నాటికి పోస్టులను భర్తీ చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.

 గతంలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత నెలలోనే పరీక్షలు జరగాల్సి ఉన్నా లాక్ డౌన్ వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగష్టు నెల 31లోపు ఈ పోస్టుల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అంతేకాకుండా గ్రామ సచివాలయాల నిర్మాణాన్ని కూడా ఆగష్టు 31 కల్లా పూర్తి చేస్తామని అధికారులు తెలియజేశారు.

ఇక మరోవైపు మరోవైపు ఏపీలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1887 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 547 కరోనా కేసులు నమోదు కాగా విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 4 కేసులు నమోదయ్యాయిఇక ఈ మహమ్మారి బారి నుంచి 842 కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే.. మరోవైపు రాష్ట్రంలో  ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని భావించి వారికీ తగిన విధంగా ఆదుకుంటుంది.
Tags:    

Similar News