జగన్ నోట రాజమౌళి మాట

Update: 2017-01-20 06:54 GMT
బాబును ఎటకారం ఆడేయటం జగన్ కు కొత్తేం కాదు. విషయం ఏదైనా.. బాబుపై పంచ్ ల మీద పంచ్ లు వేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటారు జగన్. తాజాగా ఆయన ఏపీ రాజధాని అమరావతి రైతులకు సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టారు. అమరావతి ప్రాంతంలో పర్యటిస్తూ.. రైతుల వెతలు తెలుసుకుంటూ ఏపీ ముఖ్యమంత్రిపై మాటల దాడిని సరికొత్తగా మొదలు పెట్టారు.

రాజకీయం అన్నాక ఇలాంటివన్నీ మామూలే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జగన్ మాటల తూటాల్లోకి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళికూడా వచ్చి చేరారు. ఏ దేశానికి వెళితే ఆ దేశం నుంచి అమరావతి ప్లాన్ తీసుకుంటామని చంద్రబాబు చెబుతుంటారంటూ.. ‘సింగపూర్ వెళితే.. సింగపూర్ డిజైన్ అంటారు. చైనా వెళితే చైనా డిజైన్ అంటారు. బాహుబలి సినిమా చూసి.. రాజమౌళితో రాజధాని డిజైన్ గీయిస్తామని చెబుతుంటారు’’ అంటూ ఎంత ఎటకారం ఆడేయాలో అంత ఎటకారంఆడేశారు జగన్. బాహుబలి సినిమాలో మహిష్మతి రాజ్యం మాదిరే అమరావతి మాస్టర్ ప్లాన్ అన్నది ఊహాలోకంగా వర్ణిస్తూ.. బాబుపై వ్యంగస్త్రాలు సంధించారు. జగన్.

ఏపీ ప్రజలు అద్భుతమైన రాజధాని కోరుకుంటున్నారే కానీ.. ఆచరణ కానీ హామీలు కాదని చెప్పిన జగన్.. రాజధాని పేరుతో రియల్ దందాను నడుపుతున్నారని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో అద్దె భవనంలో ఉంటున్నారని.. త్వరలో తాను సొంత భవనాన్ని కొనుగోలు చేసి.. అమరావతిలో ఉండనున్నట్లుగా జగన్ వెల్లడించారు. విపక్ష నేతగా ఎన్నికై రెండున్నరేళ్లు గడిచినా.. అమరావతిలో ఇల్లు కొనటానికి జగన్ కు కుదర్లేదా? 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News