జ‌క్క‌న్న‌తో బాబు..జ‌గ‌న్ అదిరిపోయే సెటైర్‌

Update: 2017-12-14 11:19 GMT
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు నాలుగేళ్ల క్రితం ఏం చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశాడో ఆలోచన చేసుకోవాల‌ని వైసీపీ అధినేత‌ - ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రోసారి మోసం చేసేందుకు చంద్రబాబు యాక్టర్లు - డైరెక్టర్లను వెంట బెట్టుకొని వస్తాడని, ఈ సారి వారి మాటలు నమ్మవద్దని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు సూచించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరని - ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో రాప్తాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు పోరాడుతున్నానని, తనకు మీ అందరి తోడు కావాలని వైయస్‌ జగన్‌ కోరారు.

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నిలుపుకోలేని - ప్ర‌జా సంక్షేమ పాల‌న చేయ‌లేని చంద్రబాబును క్ష‌మిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటాడని ఎద్దేవా చేశారు. ` ప్ర‌తి ఇంటికి బంగారం...ప్రతి ఇంటికి మారుతి కారు కొనిస్తా అంటాడు. ఈ మాటలు కూడా నమ్మరేమో అని సినిమా యాక్టర్లను - డైరెక్టర్లను పక్కన పెట్టుకొని వస్తారు. ఈ మధ్య కాలంలో ఓ డైరెక్టర్‌ బహుబలి సినిమా తీశారు. ఈయన్ను చంద్రబాబు పిలిపించుకొని అమరావతిపై మీరు సినిమా తీయమని కోరారట. అమరావతిలో పర్మినెంట్‌ పేరుతో ఒక్క ఇటుక కూడా పడలేదు. రేపు పొద్దున ఆ డైరెక్టర్‌ సినిమా సెట్లు వేస్తారు. అందులో నారాయణ పాత్ర. ఆ సినిమా తీసి అదిగో బాహుబలి అంటారు.`` అంటూ అమ‌రావ‌తి నిర్మాణం తీరుపై జ‌రుగుతున్న ప్ర‌చార హ‌డావుడిని వైఎస్ జ‌గ‌న్ ఎద్దేవా చేశారు.

యాక్టర్లను పిలిపించుకొని ప్ర‌చారానికి వచ్చే చంద్రబాబుకు చాలా అనుభ‌వం ఉంద‌ని అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు మంచికి త‌న పేరు... అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోతే...కేంద్రం సహకరించలేదని చెబుతారని ఎద్దేవా చేశారు. `బాబుకోసం వ‌చ్చే న‌టుడు వచ్చినప్పుడు అయ్యా... యాక్టర్‌ గారు చంద్రబాబు ఇన్ని మోసాలు చేసినప్పుడు ఆ మోసాల్లో మీ భాగస్వామ్యం లేదా అని అడగండి. కత్తి తీసుకొని ఓ వ్యక్తిని పొడిస్తే  - ఆ వ్యక్తికి కత్తి ఇచ్చిన నీవు కూడా భాగస్వామికి కావా అని అడగండి` అంటూ ప‌రోక్షంగా జ‌న‌సేన పార్టీ అధినేతను జ‌గ‌న్ ప్ర‌స్తావించారు.

గ్రామాల్లో చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేసి దోపిడీకి తెర లేపారని ప్రజా పంపిణీ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడని, వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు  విలేజ్‌ మాల్స్‌ ను రిలయన్స్ - ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీ వాళ్లు నడుపుతారట. ఇవాళ విజయవాడలో మొట్టమొదటి విలేజ్‌ మాల్‌ ఓపెన్‌ చేశారు. ఈ మాల్‌ లో ఒక్కసారి రేట్లు చూడండి. చక్కెర - కంది పప్పు - పామాయిల్ - కారంపొడి - ఉప్పు - చింతపండు మార్కెట్‌ ధర కంటే  విలేజ్‌ మాల్స్‌ లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మనకు మేలు చేస్తున్నట్లు మళ్లీ చంద్రబాబు ఫోజు కొడుతున్నారు.` అని ఎద్దేవా చేశారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. అన్నదాతలు బ్యాంకులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. పంట విస్తీర్ణం తగ్గిపోయింది. కరువు పరిస్థితుల కారణంగా పక్క రాష్ట్రాలకు వెళ్లి వాచ్‌ మన్‌ గా పని చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. `రైతులకు నాలుగు సమస్యలు ఉన్నాయి. పెట్టుబడుల కోసం మనం అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామంటే..జూన్‌ లో పంటలు వేసే కంటే ముందే మే నెలలోనే ప్రతి  రైతుకు రూ.12500 పెట్టుబడి కోసం అందజేస్తాం.` అని ప్ర‌క‌టించారు.

చంద్రబాబు పాలనలో అనేక కష్టాలు చూస్తున్నాను కాబట్టి మంచి చట్టాలను తీసుకొని వస్తానని వైఎస్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. `నవరత్నాల్లో కూడా మార్పులు - చేర్పులు ఉంటే నాకు సలహాలు, సూచనలు ఇవ్వమని కోరుతున్నాను. ఎవరైనా రావొచ్చు, ఎవరైనా సలహాలు ఇవ్వవచ్చు. నేను మీ సలహాలు తీసుకుంటాను. ఈ ప్రజా సంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్లు సాగుతోంది. అనంత‌రం మీ అభిప్రాయాల‌తో ఆ ప్ర‌జ‌ల కోసం ఇచ్చే హామీలు ఉంటాయి` అని జ‌గ‌న్ వివ‌రించారు.
Tags:    

Similar News