ఇసుక పై ముఖ్యమంత్రి యుద్ధం

Update: 2019-10-30 04:03 GMT
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి దొరికే ఏ చిన్న అవకాశాన్ని ప్రతిపక్షాలు వదులుకోవు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక పాలసీని రద్దు చేసి... కొంత సమయం తీసుకుని కొత్త పాలసీ ప్రకటించింది. అయితే... కొత్త పాలసీ వచ్చాక ఇసుక దొరుకుతుంది అనుకునేలోపు వరదలు మొదలై ఇసుక లభ్యత భారీగా పడిపోయింది. అంతకుముందు ఇసుక ఉండి పాలసీ లేదు, తర్వాత పాలసీ వచ్చినా... వర్షాల వల్ల ఇసుక లభ్యం కాలేదు. అయితే... ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టడానికి ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఇసుక కొరతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని వారం రోజుల్లో పూర్తిగా ఇసుక కొరత లేకుండా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమైన నిర్ణయాలు
* ఇసుక వారోత్సవాలు నిర్వహించి వారం రోజుల పాటు ఇసుక కొరత పరిష్కారంపై పనిచేయాలని అధికారులకు ఆదేశం.
* సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడానికి గట్టి పహారా పెట్టాలని పోలీసు బాస్ కు ఆదేశం.
* ఇసుక లభ్యతకు కారణం ప్రభుత్వం కాదని, వరుసగా వస్తున్న వరదలు అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం.
* 267 ఇసుక రీచ్ లు రాష్ట్రంలో గుర్తిస్తే... వర్షాల వల్ల దాదాపు 200 ఇసుక రీచ్ లు పనిచేయలేదన్న విషయాన్ని వివరించడం, అదే సమయంలో అన్ని రీచ్ లు ఇపుడు ఓపెన్ చేసి ఇసుకను భారీగా అందుబాటులోకి తేవడం.
* ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయిన వారికి గ్రామ సచివాలయం ద్వారా పని కల్పించే ఏర్పాట్లు వెంటనే చేయడం.
Tags:    

Similar News