జ‌గ‌న్ ఫుల్ క్లారిటీ!...హోదా కోసం ఎందాకైనా!

Update: 2019-01-16 15:32 GMT
ఏపీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఫుల్ క్లారిటీతోనే ముందుకు సాగుతున్నారు. అది కూడా ఏపీకి ఏది ప్ర‌యోజ‌న‌క‌ర‌మో... దానిని సాధించే దిశ‌గానే జ‌గ‌న్ సాగుతున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యంపై ప‌లుమార్లు స్ప‌ష్ట‌త ఇచ్చిన జ‌గ‌న్‌... తాజాగా టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తో భేటీ సందర్భంగానూ త‌న వైఖ‌రిని తేల్చి పారేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే కూట‌మి - పార్టీల‌కే త‌న మ‌ద్ద‌తు అని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌... తాజాగా నేడు కేటీఆర్‌ తో భేటీ సంద‌ర్బంగానూ అదే మాట చెప్పేశారు.  ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించ‌డ‌మే త‌మ అంతిమ ల‌క్ష్య‌మ‌ని చెప్పిన జ‌గ‌న్‌... ఆ దిశ‌గా త‌మ‌తో క‌లిసి పోరాడేందుకు సిద్ద‌ప‌డితేనే... ఫెడ‌రల్ ఫ్రంట్‌ కు మ‌ద్ద‌తుగా ముందుకు వ‌స్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. మొత్తంగా మ‌రో 3 నెల‌ల్లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న కీల‌క త‌రుణంతో టీఆర్ ఎస్‌ తో పొత్తు ఏ ప్ర‌మాదానికి దారి తీస్తుందోన‌న్న అనుమానం వ్య‌క్త‌మ‌వుతున్నా... రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మని తేల్చేసిన జ‌గ‌న్‌... ఈ విష‌యంలో మ‌రో ఆలోచ‌న‌కు తావు లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

కేంద్రంలో బీజేపీతో - ఇక్కడ టీఆర్ ఎస్‌ తో వైసీపీ లోపాయికారీ పొత్తు కొన‌సాగిస్తోందని ఏపీలో అధికార పార్టీ టీడీపీ నానా యాగీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చి మోసం చేసిన బీజేపీతో చేతులు ఎలా క‌లుపుతార‌ని కూడా టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అయితే 14 నెల‌ల పాటు సాగిన త‌న సుదీర్ఘ పాద‌యాత్ర‌లో గానీ, యాత్ర ముగింపు సంద‌ర్భంగా చేసిన ప్ర‌సంగంలో గానీ పొత్తుల విష‌యంపై జ‌గ‌న్ చాలా క్లారిటీ ఇచ్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పే ఏ పార్టీకి అయినా బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తామ‌ని - ఆ పార్టీ కాంగ్రెస్ అయినా - బీజేపీ అయినా త‌మ‌కేమీ ఇబ్బంది లేద‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఇప్ప‌టిదాకా త‌మ పార్టీ ఏ ఒక్క పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేద‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ ఇంత స్ప‌ష్టంగా ప్ర‌క‌టించినా కూడా టీడీపీ... బీజేపీతో వైసీపీ లోపాయికారీ ఒప్పందం చేసుకుంద‌ని ప‌దే ప‌దే ఆరోపిస్తూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే టీఆర్ ఎస్ ప్ర‌తినిధి బృందంతో జ‌గ‌న్ భేటీ చాలా ప్రాధాన్యం సంత‌రించుకుంద‌ని చెప్పాలి.

ఓ వైపు టీడీపీ ఎంత‌టి నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నా... టీఆర్ ఎస్ తో భేటీ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఏమాత్రం త‌త్త‌ర‌పాటుకు గురి కాలేద‌నే చెప్పాలి.  ఈ భేటీకి సంబంధించి టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ఫోన్ చేసిన సంద‌ర్భ‌గా... ఏపీకి ప్ర‌త్యేక హోదాకు అనుకూలంగా వ‌స్తేనే తాను చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని జ‌గ‌న్ తేల్చేశారు. జ‌గ‌న్ కండీష‌న్‌ కు ఓకే చెప్పిన కేసీఆర్... చ‌ర్చ‌ల‌కు ప్ర‌తినిధి బృందాన్ని పంపుతున్న‌ట్టుగా చెప్పారు. చ‌ర్చ‌ల సంద‌ర్భంగానూ కేటీఆర్ ముందు జ‌గ‌న్ ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం టీఆర్ ఎస్ కూడా త‌మ పోరుకు మ‌ద్ద‌తుగా నిలిస్తేనే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని జ‌గ‌న్ సుస్ప‌ష్టంగా చెప్పారు. దీనికి కేటీఆర్ కూడా ఓకే చెప్ప‌డంతో చ‌ర్చ‌ల అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కూడా జ‌గ‌న్ అదే విష‌యాన్ని చెప్పారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపీలు పార్ల‌మెంటులో పోరాడినా ఫ‌లితం ఉండ‌ద‌ని, అదే తెలంగాణ‌లోని 17 మంది ఎంపీలు కూడా క‌లిసి వ‌స్తే... కేంద్రం మెడ‌లు వంచ‌గ‌ల‌మ‌ని చెప్పారు. ఆ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదా కోసం తెరాస కూడా క‌లిసి వ‌స్తుంద‌ని హామీ ల‌భించిన త‌ర్వాతే... తాను ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వైపు మొగ్గుచూపుతున్న‌ట్లుగా జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. మొత్తంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధనే ల‌క్ష్యంగా జ‌గ‌న్ త‌న ప్ర‌తి అడుగును చాలా ఆలోచించి వేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News