రాజకీయాల్లో నాయకులు ఏం చేసినా.. ఓటు బ్యాంకుపైనే దృష్టి ఉంటుంది. అడుగు తీసి అడుగు వేస్తే.. ఖచ్చితంగా.. వారి వ్యూహాలు.. ఓట్ల సాధన.. అధికారంపై పట్టుకోసమే ఉంటుందనే విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కేబినెట్‌ను ఏర్పాటు చేసుకునే సమయంలో.. జగన్.. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదేసమయంలో మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. 33శాతం రిజర్వేషన్‌ను అమలు చేశారు. తద్వారా.. సోషల్ ఇంజనీరింగ్ అమలు చేశారంటూ.. పెద్ద ఎత్తున ఆయనకు ప్రశంసలు వచ్చాయి.
ఇక, ఇప్పుడు ఇదే విధంగా శాసన మండలిలోనూ సోషల్ ఇంజనీరింగ్ దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అటు ఎమ్మెల్యే కోటాలో 3, ఇటు స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలను.. కేంద్ర ఎన్నికల సంఘం భర్తీ చేయనుంది.ఇప్పటికే దీనికి సంబంధించి న నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే.. ఈ ఎన్నికల్లో పోటీ లేకపోవడం గమనార్హం. అధికార పార్టీ వైసీపీ కే.. ఇటు స్థానిక సంస్థల్లోనూ.. అటు.. ఎమ్మెల్యేల పరంగా కూడా.. బలం ఉండడంతో పోటీకి మరెవరూ వ చ్చే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ నిర్ణయించిన వారే నేరుగా ఎమ్మెల్సీ అవుతారు.
ఎమ్మెల్యేల కోటాలోని మూడు స్థానాల్లో ఒకటి డీసీ గోవిందరెడ్డి, మరోటి పాలవలస విక్రాంత్‌కు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ముఖ్యమంత్రి శ్రీకాకుళం పర్యటనకు వెళ్లినపుడు అక్కడే విక్రాంత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారంటూ ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. మూడో స్థానం కొలిక్కి రావాల్సి ఉంది. ఈ నెల 15 లేదా 16న ముగ్గురు అభ్యర్థులూ నామినేషన్లు వేయవచ్చంటున్నారు. ఇక, స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ 14 స్థానాలనూ కైవసం చేసుకుంటామని వైసీపీ అధినాయకత్వం స్పష్టం చేస్తోంది.
అయితే.. మామూలుగా.. ఈ స్థానాలను కైవసం చేసుకుంటే.. పస ఏముంటుందని.. అనుకున్నారో.. ఏమో జగన్.. వచ్చే ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని.. మండలి విషయంలో వ్యూహాత్మకంగా.. అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో ఎలా అయితే.. సోషల్ ఇంజనీరింగ్ అమలు చేసినట్టే.. మండలి విషయంలోనూ.. అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీ ఎమ్మెల్సీల్లో 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. అందులోనూ 50 శాతం మంది మహిళలు ఉండేలా కొత్త అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇక, శాసనమండలిలో ఇప్పటికే ఆ పార్టీకి 18 మంది సభ్యులున్నారు. కొత్తగా 14 స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ బలం 32కు చేరుతుంది.