అధికారులు వణికేలా వార్నింగ్ ఇచ్చిన జగన్

Update: 2019-11-12 12:40 GMT
కీలక వ్యాఖ్య చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా నిర్వహించిన స్పందన కార్యక్రమంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అవినీతి నిర్మూలనకు చిత్తశుద్ధితో పని చేస్తున్నవిషయాన్ని అందరూ గమనించాలన్నారు.

రెండు మూడు వారాల్లో ఏసీబీని రంగంలోకి దించనున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. అధికారం అన్నది చెలాయించేందుకు కాదని.. కేవలం సేవ చేయటానికి మాత్రమేనని జగన్ వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర ఉండే అధికారులు మొదలుకొని కిందిస్థాయి అధికారులు తాను చెబుతున్న విషయాల్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పటం ద్వారా..పని విషయంలో తానెంత సీరియస్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.  

ప్రజల మీద అధికారం చెలాయించేందుకు మనం లేమన్న జగన్.. ప్రజాసేవకులమన్న విషయాన్ని అధికారులు మర్చిపోకూడదన్నారు. అవినీతిపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేయాలని.. రాష్ట్రంలో అవినీతికి చోటు లేదన్న సందేశం త్వరగా రాష్ట్రంలోని అందరి అధికారులకు చేరాలన్నారు.

రెండు మూడు వారాల్లో పెద్ద ఎత్తున ఏసీబీని రంగంలోకి దించనున్నట్లు చెప్పిన జగన్.. అవినీతి అధికారుల భరతం పట్టటానికి రంగం సిద్ధం చేశామన్న విషయాన్ని చెప్పేశారు. స్పందనలో వచచే కంప్లైంట్ల పరిష్కారానికి ఆరు జిల్లాల్లో శిక్షణ.. అవగాహన కార్యక్రమాల్ని పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. అవినీతిపై జగన్ పూరించిన సమర శంఖం రాష్ట్రంలోని అధికారులకు వణుకు పుట్టేలా చేస్తుందనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News