బ‌డ్జెట్‌ పైనా జ‌గ‌న్ మార్క్‌..బాబు త‌ప్పులే ప్ర‌ధానాస్త్రం

Update: 2019-07-11 07:21 GMT
ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తొలిసారి ప్ర‌వేశ పెట్ట‌నున్న 2019-20 వార్షిక బ‌డ్జెట్‌పై చాలానే అంచ‌నాలు ఉన్నాయి. సంక్షేమం ప్రాతిప‌దిక‌గా ఆయ‌న వేసే ప్ర‌తి అడుగు ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌నున్న బ‌డ్జెట్ కోసం మేదావు లు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి వ‌డ్డ‌న‌లు లేకుండా.. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా జ‌గ‌న్ ముందుకు ఎలా సాగుతార‌నే విష‌యంపై చ‌ర్చ కూడా సాగుతోంది. మ‌రోప‌క్క‌ - మ‌ద్యాన్ని నియంత్రించ‌డం ద్వారా త‌గ్గిపోయే ప్ర‌భుత్వ ఆదాయాన్ని ఎలా స‌మీక‌రించుకుంటార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. అయితే, తాజాగా స‌భ ప్రారంభ‌మైన తొలిరోజు స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌ను బ‌ట్టి.. బ‌డ్జెట్ స్వ‌రూపం ఇలా ఉంటుందా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

గ‌డిచిన ఐదేళ్ల కాలంలో చంద్ర‌బాబు చేసిన పాల‌న‌ను జ‌గ‌న్ ఇంకా టార్గెట్ చేస్తున్నారు. మీ వ‌ల్లే రాష్ట్ర భ‌విష్య‌త్తు నాశ‌నం అయింద‌ని స‌భా ముఖంగానే ఆయ‌న చెప్పేశారు. లోటు బ‌డ్జెట్‌ లో ఉన్న రాష్ట్రాన్ని చంద్ర‌బాబు పాల‌న మ‌రింత అప్పుల ఊబిలోకి దించింద‌నే విష‌యాన్ని జ‌గ‌న్ స్ఫ‌ష్టం చేస్తున్నారు. స‌మావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు నిర్వ‌హించిన బీఏసీ స‌మావేశంలోనూ ఇదే విష‌యాన్ని ఆయ‌న ఉటంకించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అధోగతి పాలయ్యాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. రెండంకెల వృద్ధిరేటంటూ గత ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలన్నీ గారడీలేనని స్పష్టం చేశారు.

హోదా సాధనలో విఫలమై ప్యాకేజీకి ఒప్పుకొని గత ప్రభుత్వం ఘోరతప్పిదానికి పాల్పడిందని - దానివల్ల విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన అనేక ప్రయోజనాలు ఆగిపోయాయని వివరించారు. ‘‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలించిన 2004-09లో మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధించింది. ఆ కాలంలో 12 శాతం వృద్ధి నమోదైంది’’ అని ఆర్థిక మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం తయారుచేసిన శ్వేతపత్రాన్ని సచివాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విడుదల చేశారు.

దీనిని బ‌ట్టి బ‌డ్జెట్‌ లోనూ చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించేందుకు ప్ర‌భుత్వం అన్ని సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. విభజన సమయంలో తెలంగాణకు ఉన్నంత పన్ను ఆదాయం మనకు లేదు. తలసరి ఆదాయం కూడా తెలంగాణ కంటే చాలా తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఈ అంశాన్ని నీరుగార్చి ప్రత్యేక ప్యాకేజీ వినూత్నమైందంటూ టీడీపీ ప్రభుత్వం దానికి జైకొట్టింది. ప్యాకేజీ నుంచి ఏమైనా నిధులు తెచ్చారా అంటే అవీ తేలేకపోయారు. ఘోరాతిఘోరమైన పరిస్థితుల్లో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మాకు అప్పగించింది. ప్యాకేజీ పేరుతో రాష్ట్రప్రయోజనాలకు నీళ్లొదిలారు.

దుగరాజపట్నం పోర్టు నిర్మించాలని విభజన చట్టంలో ఉండగా - ఆ పోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని రాసి ఉన్న ప్యాకేజీకి చంద్రబాబు జై కొట్టారు. ప్యాకేజీలోని మూడో పాయింట్‌ లో స్టాండడైజ్డ్‌ విధానంలో రెవెన్యూలోటు చెల్లిస్తామనే నిబంధనను కేంద్రం పెట్టింది. దాని ప్రకారం ఏపీ గణాంకాలను కేంద్రం తప్పని వాదిస్తోంది. అని చెప్ప‌డం ద్వారా రేప‌టి బ‌డ్జెట్‌ లో చంద్ర‌బాబును మ‌రింత గా తూర్పార బ‌ట్టేందుకు జ‌గ‌న్ స‌ర్కారు స‌న్న‌ద్ధ‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


Tags:    

Similar News