ఏపీఎస్ ఆర్టీసీకి మరో సత్తువ ఇస్తున్న జగన్!

Update: 2019-10-16 14:30 GMT
ఒకవైపు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు.  తమకు న్యాయం చేయాలంటూ వారు  బస్సులను  ఆపేశారు. అయితే కార్మిక సంఘాలతో చర్చలకు కూడా అక్కడి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. వ్యవహారం కోర్టులో - కార్మికులు సమ్మెలో ఉన్నారు.

ఆ సంగతలా ఉంటే..ఇప్పటికే ఏపీలో ఆర్టీసీకి మంచి బూస్టప్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు జగన్. అందుకు సంబంధించిన సాంకేతిక  ప్రక్రియ నడుస్తూ ఉంది.

ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు భారీ ఎత్తున బస్సులను కొనుగోలు చేయడానికి జగన్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీకి భారంగా మారిన డొక్కు బస్సులను తప్పించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏకంగా మూడు వేల ఐదు  వందల బస్సులు సరైన కండీషన్లో లేవని ఆర్టీసీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు.

ఆ బస్సులను విధుల నుంచి తప్పించాలని - వాటి స్థానంలో కొత్త బస్సులను కొనాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గానూ దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

ఇప్పటికే కార్మికులకు ఉత్సాహాన్ని ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు కొత్త బస్సులతో సంస్థనుకూడా పటిష్టపరచడానికి రంగం సిద్ధం చేయడం గమనార్హం.
Tags:    

Similar News