ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14 నుంచి మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా సభలో ప్రవేశపెట్టే బిల్లుల గురించి చరించేందుకు మంత్రి వర్గ సమావేశాన్ని అదే రోజున ఏర్పాటు చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశాలో మూడు రాజధానుల విషయం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చిస్తారు అని అంటున్నారు. అదే విధంగా ఎపుడు విశాఖకు షిఫ్ట్ అయ్యేది కూడా వారికి తెలియచేస్తారు అని అంటున్నారు.
ఇక ఈ నెల 14న అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశం మీద సభలో చర్చ ఉంటుంది. 17న బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశపెడతారు. అయితే ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ కి ధన్యవాధాలు తెలిపే అంశం మీద క్లోజింగ్ రిమార్క్స్ ఇస్తారు. ఆ సమయంలోనే ఆయన మూడు రాజధానుల మీద పూర్తి క్లారిటీతో కూడిన ప్రకటన ఒకటి చేస్తారు అని అంటున్నారు.
నిజానికి అమరావతి రాజధాని అంశం అసెంబ్లీ సమావేశాల నాటికి సుప్రీం కోర్టులో విచారణ పూర్తి అయి తీర్పు వస్తుందని తలచారు. దీని మీద జనవరి 30న ఒక వాయిదా పడింది ఆ తరువాత అది కాస్తా జరిగి ఇపుడు మార్చి 28కి వాయిదా వేశారు. దీని మీద ఇప్పటికే పలు మార్లు ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టుని వేగంగా ఈ కేసుని విచారించమని కోరారు.
అయితే అత్యున్నత న్యాయం స్థానం మాత్రం ఇందులో ఎన్నో రాజ్యంగపరమయిన అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి తొందర తగదని చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో అంత తొందర ఉన్న వారు హై కోర్టు తీర్పు తరువాత ఆరు నెలలు ఆగి సుప్రీం కోర్టుకు ఎందుకు వచ్చారని కూడా ప్రశ్నలు అడిగినట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా సుప్రీం కోర్టులో ఈ కేసు మార్చి 28న విచారణకు వస్తే ఎపుడు పూర్తి అవుతుంది తీర్పు వస్తుంది అన్నది తెలియదు.
ఎందుకంటే ఇందులో అనేక సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయని అంటున్నారు. దాంతో న్యాయ పరంగా అనుమతి లేకుండా ఈ తీర్పు రాకుండా ఒక్క అడుగు కూడా ఏపీ ప్రభుత్వం వేసే చాన్స్ లేదు. అయితే అసెంబ్లీలో జగన్ మూడు రాజధానుల మీద ఏమి మాట్లడుతారు అన్నదే ఆసక్తిగా ఉంది. మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సుప్రీం కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే సత్వరమే వికేంద్రీకరణను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అత్యున్నత చట్ట సభ వేదికగా చెప్పవచ్చు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే మూడు రాజధానుల అంశం మీద ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పు విషయంలో కొండంత ఆశలే పెట్టుకుంది అని అంటున్నారు. ఈ కేసులో తమకు అనుకూలంగా తీర్పు రావచ్చునని అపుడు రాజమార్గంలో విశాఖకు రాజధానిని తరలించేందుకు వీలు కుదురుతుందని భావిస్తోంది. మొత్తానికి ఏపీ అసెంబ్లీలో జగన్ ఏ రకమైన ప్రకటన చేయబోతారు అన్నది మాత్రం ఆసక్తిని రేపుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.