ప‌దిరోజుల్లో పీఆర్సీ.. జ‌గ‌న్ గుడ్ న్యూస్‌

Update: 2021-12-03 06:52 GMT
పీఆర్సీ ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ ఉద్య‌మానికి స‌ద్ధ‌మ‌వుతున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సీఎం జ‌గ‌న్ గుడ్‌న్యూస్ చెప్పారు. ప‌దిరోజుల్లో పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌న్నారు. తిరుప‌తిలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తున్న ఆయ‌న ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కొంత‌మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు ఆయ‌న్ని క‌లిశారు.

పీఆర్సీ నివేదిక అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయ‌న‌.. పీఆర్సీకి సంబంధించిన క‌స‌ర‌త్తు పూర్త‌యింద‌ని మ‌రో ప‌ది రోజుల్లో పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు.

జ‌గ‌న్ తాజా ప్ర‌క‌ట‌న‌తో ఉద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక‌పై ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

ప్ర‌భుత్వం త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌డం లేద‌ని అసంతృప్తితో ఉద్యోగ సంఘాల నేత‌లు ధ‌ర్నాకు దిగేందుకూ సిద్ధ‌మ‌య్యారు. పీఆర్సీపై గ‌త నెలాఖ‌రు లోపు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌కుంటే ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేస్తామ‌ని కూడా హెచ్చరించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న వారికి ఊర‌ట‌నిచ్చింది.

పీర్సీతో పాటు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఉద్యోగ సంఘాలు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌కు నోటీసులిచ్చాయి. ఈ నెల 7 నుంచి న‌ల్ల‌బ్యాడ్జీల‌తో విధుల‌కు హాజ‌ర‌వుతామ‌ని 10వ తేదీ నుంచి లంచ్ విరామ స‌మ‌యంలో నిర‌స‌న తెలుపుతామ‌ని ప్ర‌క‌టించాయి.
దీంతో శుక్ర‌వారం ప్ర‌భుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స‌మావేశం ఏర్పాటు చేసింది.

ఈ స‌మావేశంలో పీఆర్సీ నివేదిక‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, సీపీఎస్ ర‌ద్దు, హెల్త్ కార్డుల త‌దిత‌ర విష‌యాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా మ‌రోవైపు పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు.

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌ను ఏపీ జేఏసీ అధ్య‌క్షుడు బండి శ్రీనివాస్ స్వాగ‌తించారు. అయితే తాము ఇచ్చిన 71 డిమాండ్ల‌లో ప్ర‌ధాన‌మైన పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ వంటి స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్కారిస్తారో చెప్పాల‌ని డిమండ్ చేశారు.

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స‌మావేశంలో స‌రైన స‌మాధానం రాక‌పోతే ఉద్య‌మాన్ని మ‌రింత ఉద్ధృతం చేస్తామ‌న్నారు. పీఆర్సీ నివేదిక‌ను బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేశారు.




Tags:    

Similar News