జ‌గ‌న్ వ‌ర్సెస్ కేసీఆర్‌.. కేబినెట్ వ్యూహాల‌పై నెటిజ‌న్ల టాక్ ఇదే!

Update: 2022-04-17 01:30 GMT
అమెరికా దేశానికి జ‌లుబు చేస్తే..ప్ర‌పంచం మొత్తం తుమ్ముతుంద‌నే సామెత ఉంది. అలానే.. ఏపీలో ఏం జ‌రిగినా.. తెలంగాణ‌లో ఏం జ‌రిగినా.. రెండు రాష్ట్రాల్లోనూ.. ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంటుంది. అవి ప‌థ‌కాలైనా..ప్ర‌ణాళిక‌లైనా.. లేదా స‌మ‌స్య‌లైనా..ప‌రి ష్కారాలైనా.. రెండు రాష్ట్రాల్లో ప్ర‌బుత్వాలు తీసుకునే నిర్ణ‌యాల‌పై అంత ప్ర‌భావం ఉంటుంది. ఇరు రాష్ట్రాల్లోనూ చ‌ర్చించుకుంటా రు. మ‌రీ ముఖ్యంగా ఏపీలో జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాలు..తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్  తీసుకునే నిర్ణ‌యాల‌ను మ‌రింత ఆస‌క్తిగా నెటిజ‌న్లు గ‌మ‌నిస్తుంటారు. ఎందుకంటే.. ఇద్ద‌రూ కూడా.. రాజ‌కీయ మిత్రులే క‌నుక‌! అంతేకాదు..ప‌ర‌స్ప‌రం స‌ల‌హాలు, సంప్ర‌దింపులు కూడా కొన్నాళ్లు చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో రెండు ప్ర‌భుత్వాల తీరుతెన్నుల‌పై నెటిజ‌న్లు..రెండు రాష్ట్ర మేధావులు కూడా ఆరా తీస్తుంటారు. తాజాగా..ఏపీలో కేబినెట్ కూర్పు జ‌రిగింది. దీంతో తెలంగాణ‌లోనూ మార్పులు జ‌రుగుతాయేమోన‌ని అనుకున్నారు. స‌రే.. ఆ ముచ్చ‌ట తెర‌మీది కి రాలేదు. ఇంత‌లోనే ఏపీలో మంత్రి వ‌ర్గ కూర్పు ఏర్ప‌డిపోయింది. ఏపీ మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై ఏపీలో చ‌ర్చ‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లో మాత్రం తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా ఏర్పాటు చేసిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో తెలంగాణ‌కు చెందిన మ‌హిళా నాయ‌కురాలికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంపై తెలంగాణ రాజ‌కీయ నేత‌లు స్పందిం చారు.

ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న విడ‌ద‌ల ర‌జ‌నీ.. తెలంగాణ బిడ్డ.  జ‌గ‌న్ మంత్రి వర్గంలో  చోటు దక్కించుకున్నారు. వాస్త‌వానికి ఆమె ముదిరాజ్ సామాజిక వ‌ర్గం. ఆమెకు ఏపీ సీఎం జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. అయితే..ముదిరాజ్ సామాజిక వ‌ర్గం ఏపీలో త‌క్కువ‌.

అయిన‌ప్ప‌టికీ.. ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ప్రాధాన్యం ద‌క్కించుకుంది.ఇక‌,ఇదే సామాజిక‌వ ర్గం నేత కేసీఆర్ మంత్రివ‌ర్గంలోనూ ఉండేవారు. ఆయ‌నే ఈట‌ల రాజేందర్‌. అయితే.. ఆయ‌న‌ను కేసీఆర్ వ‌ద‌లించుకున్నారు. కానీ.. వీరి ప్ర‌భావం తెలంగాణ‌లో ఎక్కువ‌గా ఉంది.అయిన‌ప్ప‌టికీ.. కేసీఆర్ ఖాత‌రు చేయ‌డం లేదు.

ఇక‌, ఏపీలో ఎక్కువ ప్ర‌భావం చూప‌గ‌ల స్తాయిలో ఉన్న క‌మ్మ‌వ‌ర్గాన్ని జ‌గ‌న్ తాజాగా 2.0 కేబినెట్‌లో ప‌క్క‌న పెట్టారు. గ‌త కేబినెట్‌లో కొడాలి నానికి మంత్రి ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్ తాజా కూర్పులో ఆయ‌నను ప‌క్క‌న పెట్టారు. కానీ, ఈసామాజిక వ‌ర్గం ఏపీలో ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌క పాత్ర పోషిస్తుంది. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ లెక్క‌చేయ‌లేదు. ఇక‌, కేసీఆర్‌మాత్రం క‌మ్మ‌ల‌ను నెత్తిన పెట్టుకున్నారు.గ‌త స‌ర్కారులో తుమ్మ‌ల నాగేశ్వ‌రరావుకు అవ‌కాశం ఇస్తే..ఇ ప్పుడు పువ్వాడ అజ‌య్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చి.. ప్రాధాన్యం క‌ల్పించారు. కానీ, ఇక్క‌డ క‌మ్మ వ‌ర్గం ప్ర‌భావం త‌క్కువ‌. ఇక‌,ఎస్సీ, ఎస్టీ.. బీసీల‌కు స‌మ ప్రాధాన్యంలోనే రెండు ప్ర‌భుత్వాలు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇదీ.. ప్ర‌స్తుతం సాగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.
Tags:    

Similar News