సొంత పార్టీ నేతలపై కేసులను జగన్ సర్కార్ ఎత్తివేస్తోంది. గత టీడీపీ హయాంలో ఇదే జరగగా.. ఇప్పుడు వైసీపీ పాలనలోనూ అదే పునరావృతమవుతోంది. ఇప్పటికే వందలమంది వైసీపీ నేతలపై గత టీడీపీ సర్కార్ నమోదు చేసిన కేసులను వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే ఉపసంహరించుకోగా.. ఇప్పుడు తమ పార్టీకి చెందిన జగన్ సన్నిహిత ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను సైతం ఎత్తేయడం విశేషం.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015లో చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణానికి వచ్చిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడే ఉన్న ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ పై దౌర్జన్యం చేశారు. వీరిద్దరూ ఆయనపై చెంపదెబ్బ కొట్టినట్టు అప్పట్లో ఏర్పేడు పోలీస్ స్టేషన్ లోకేసు నమోదైంది.
అప్పటి నుంచి ఈ కేసులో ఎంపీ, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. కేంద్రప్రభుత్వ సిబ్బందిపై దాడి కేసు తీవ్రమైనది కావడంతో వీరికి శిక్ష పడుతుందని భావిస్తున్న తరుణంలో తాజాగా జగన్ సర్కార్ ఏకంగా కేసులను ఎత్తేసి ఊరటనిచ్చింది.మిథున్ రెడ్డి, చెవిరెడ్డిలపై నమోదైన కేసుల్లో వీరిపేర్లను తొలగిస్తూ ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసింది. వీరితోపాటు మరో 18మందిపై కూడా కేసులను ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డీజీపీని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం సూచించింది.