ఏపీలో టీడీపీ సర్కార్ కొలువు దీరి రెండున్నరేళ్లు అవుతున్న నేపథ్యంలో ప్రజాసమస్యలపై పోరుతో జనంలో పట్టుసాధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ద్వారానే ఇది సాధ్యమన్న నిర్ధారణకు వచ్చిన అధినాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతిని పురష్కరించుకొని పార్టీని గడప గడపకు తీసుకెళ్లే కార్యక్రమం ద్వారా పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లే పార్టీ నిర్మాణానికి పెద్దపీట వేస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీ - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ - పార్టీజిల్లా అధ్యక్షులు - ఇన్ ఛార్జ్ లతో - నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లతో గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ పార్టీ చేపట్టే గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఆదేశించారు. ఏపీలో ఆరు కార్పోరేషన్ - ఐదు మున్సిపాలిటీ ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు ద్వారానే సాధ్యమవుతోందన్న భావన వైసీపీలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల్లో కూడా స్థానిక కమిటీలు సైతం ప్రభావాన్ని చూపుతాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. తమ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఉన్నా స్థానికంగా బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇలా పార్టీ కమిటీలు లేకపోవడం వల్లే టీడీపీని ఎన్నికల్లో ఎదుర్కోలేకపోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటడం బట్టే పార్టీ భవిష్యత్తు నిర్ధారణ అవుతుందన్న ప్రచారం ఆ పార్టీలోనే సాగుతోంది. బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకానికి కృషిచేయాలని పార్టీ శ్రేణులకు జగన్ ఆదేశించారు. స్థానిక కమిటీలను వేసే బాధ్యతలను పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు నియోజకవర్గ సమన్వకర్తలపై - పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లపై ఆయన పెట్టారు. మొత్తంగా మొదటి నుంచి మొదలు పెట్టి బలోపేతం చేసేందుకు జగన్ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు ఫలితం ఇస్తుందో మరి.