జగన్ కు పాలాభిషేకం చేసిన ఆర్కే రోజా

Update: 2019-11-14 05:16 GMT
అత్యుత్తమ స్థానం లో ఉన్న వారు తీసుకునే కొన్ని నిర్ణయాల కు విపరీతమైన సంతోషం తో సాధారణ ప్రజలు ఆయా నేతల ఫోటోల కు పాలాభిషేకం చేయటం చూస్తాం. ఇలాంటివి సామాన్యులు ఎక్కువగా చేస్తుంటారు. అందుకు భిన్నంగా అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేతతో కలిసి పాలాభిషేకం లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా అరుదుగా చెప్పాలి.

తాజాగా అలాంటి సీన్ ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. వీవోఏలకు గౌరవవేతం రూ.10వేలకు పెంచుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా కృతజ్ఞతాభినందనసభను నిర్వహించారు. ఈ సభకు నగరి ఎమ్మెల్యే.. ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయం పై వీవోఏలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సీఎం జగన్ ఫోటో కు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా కూడా వారితో కలిసి ముఖ్యమంత్రి ఫోటో కు పాలాభిషేకం చేయటం పలువురిని ఆకర్షించింది. ఎన్నికలకు ముందు వీవోఏల కు జీతం పెంచుతానని జగన్ హామీ ఇచ్చారని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో ముఖ్యమంత్రి ముందుంటారన్నారు.

రాష్ట్రం లో జన రంజక పాలన జరుగుతుందని.. గతంలో వీవోఏలకు నెలకు రూ.2వేలు జీతం ఇస్తే.. ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.10వేలకు పెంచిన ఘనత జగన్ కే చెందుతుందన్నారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన నవరత్నాల తో పాటు వివిధ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న వైనాన్ని గుర్తు చేశారు. పార్టీలోని ప్రముఖ నేతల్లో ఒకరైన రోజా సమక్షం లోనే సీఎం జగన్ ఫోటో కు పాలాభిషేకం నిర్వహించటం చూస్తే.. కొత్త ట్రెండ్ కు తెర తీసినట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News