జ‌గ‌న‌న్న గోరుముద్దలో కోత !?

Update: 2022-01-23 02:30 GMT
ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ఆపేది లేద‌ని.. ఎట్టి ప‌రిస్థితిలో వాటిని కొన‌సాగించి తీరుతామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. ఒక‌వైపు ఉద్యోగులు స‌మ్మె చేస్తున్నా.. వారిని ప‌క్క‌న పెట్టి సంక్షేమానికి పెద్ద పీట వేస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. మాత్రం సంక్షేమానికి కూడా క‌త్తెర ప‌డుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు.. ఏపీలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే చిన్నారుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లవుతోంది. దీనికి కేంద్రం నుంచి నిధులు వ‌స్తున్నాయి. వీటిలో కొంత భాగ‌మే.. రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించి.. నిర్వ‌హ‌ణ‌ను స‌క్ర‌మంగా చూడాలి.

అయితే.. నిధుల లేమో.. లేక‌.. ఏం జ‌రిగిందో తెలియ‌దుకానీ.. ఇప్పుడు గ‌డిచిన వారం రోజులు(సంక్రాంతి సెల‌వుల‌కు ముందు)గా ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో చిన్నారుల‌కు క‌డుపునిండా భోజ‌నం పెట్ట‌డం లేదు స‌రిక‌దా.. అర్ధాక‌లితోనే వారిని ఇంటికి పంపేస్తున్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అమ‌ల‌వుతున్న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కానికి `జ‌గ‌న‌న్న గోరుముద్ద‌` అని ముద్దుగా నామ‌క‌ర‌ణం చేశారు. అంతేకాదు.. ఏ రోజు ఏ భోజ‌నం పెట్టాలి...? ఏ కూర వండాలి?  వంటి అన్ని సూక్ష్మ‌మైన విష‌యాల‌ను కూడా ఆయ‌నే నిర్దేశించారు. దీనిని పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేసుకున్నారు.

అయితే.. ఇప్పుడు ఈ గోరు ముద్ద కూడా నిలిచిపోయి.. విద్యార్థుల‌కు `అర` గోరుముద్ద మాత్ర‌మే అందుతుండ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి మెనూ ప్రకారం వారాన్ని బ‌ట్టి అన్నం, కిచిడి, టమోట చట్నీ, ఉడికించిన గుడ్డు ఇస్తూ ఉంటారు. అయితే హఠాత్తుగా ఈ మెనూ మారిపోయింది. మ‌ధ్యాహ్న భోజ‌నం పోయి.. వాటి స్థానంలో ఇడ్లీ, సాంబార్ వ‌చ్చేసింది. అది కూడా నీళ్ల సాంబారు.. అర్ధ‌రూపాయంత ఇడ్లీలు!!(ఇది నిజం). అనుకున్నదే తడవుగా తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని అమలు చేయడం ప్రారంభించారు. ప్రతి గురువారం పిల్లలకు మధ్యాహ్న భోజనం ఉండదు. దానికి బదులుగా నాలుగు ఇడ్లీలు, సాంబార్ ఇస్తారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మాత్రం ఐదు ఇడ్లీలు ఇస్తారు.

ఉదయం పూట టిఫిన్‌గా మాత్రమే ఇడ్లీలు తింటారని పిల్లలకు తెలుసు. మధ్యాహ్నం అన్నం తింటామని వారు చదువుకున్నా రు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఇడ్లీలను అలవాటు చేయడానికి సిద్దపడటం వారిని కూడా ఆశ్చర్య పరుస్తోంది. కిచిడీ, ఎగ్ , టమాటా చట్నీకి ఉండేంత పోషకాలు ఇడ్లీల్లో ఉంటాయా అన్న సందేహాలు... వ్య‌క్త‌మ‌వుతున్నా.. అధికారులు మాత్రం ఆదేశాలు తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నారు. కిచిడి, టమాటా చట్ని, ఎగ్ పెట్టాలంటే చాలా ఖర్చవుతుంది.. ఇడ్లీలతో అయితే సింపుల్‌గా అయిపోతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ఇటీవల గోరుముద్ద పథకంపై రాష్ట్ర ప్రభుత్వానికి స్మృతి ఇరానీ లేఖలు రాశారు. పథకం నిధుల లెక్కలు చెప్పాలన్నారు. ఈ క్రమంలో మెనూ మార్పు నిర్ణయాలు బయటకు రావడం ఆశ్చర్య పరుస్తోంది. అంటే ఈ ప‌థ‌కం కొసం కేంద్రం ఇచ్చిన నిధుల‌ను  ప‌క్క‌దారి ప‌ట్టించేశారా? అనే సందేహాలు వ్య‌క్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News