ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి..అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా పాలనే ద్యేయంగా , ప్రజల సంరక్షణే లక్ష్యంగా పలు విప్లవాత్మకమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ మాటల సీఎం కాదు చేతల సీఎం అని నిరూపించుకుంటున్నారు. రాష్ట్రంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ సమయంలో కూడా కరోనా కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు .. సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూల్స్ రూపు రేఖలను మార్చి ఏపీ ప్రభుత్వం నూతన విద్యా ఒరవడికి శ్రీకారం చుట్టింది. అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి సంక్షేమ పథకాలతో పాటుగా, ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రభుత్వ ప్రవేశపెట్టేందుకు జగన్ సర్కార్ కృషి చేస్తోంది. విద్యా కానుక కిట్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే ప్రతీ విద్యార్ధికి మూడు జతల యూనిఫామ్, టెక్ట్స్, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, నోటు పుస్తకాలు అందించనున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు నోట్ బుక్స్ చేరుకోగా.. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి నోట్ బుక్స్, యూనిఫాం, బూట్లు, సాక్సులను కూడిన కిట్ ను విద్యార్ధులకు ఇచ్చేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు.
కాగా, సెప్టెంబర్ 5వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేయాలనే ఆలోచనలో ఉందట ప్రభుత్వం. విద్యార్థినీ, విద్యార్థులకు రెండు రంగుల బ్యాగులను ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే ఈ బ్యాగుల డిస్ట్రిబ్యూషన్ గురించి సీఎం జగన్ పరిశీలించిన విషయం తెలిసిందే. ఎన్నికల హామీ ప్రకారం ఇంటింటికి నాణ్యమైన బియ్యం అందించాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని డిసెంబర్ 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.