విజయనగరం జిల్లాలోని బోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి చంద్రబాబు హయాంలో శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. 2624 ఎకరాల్లో విమాశ్రయాన్ని నిర్మించడంతో పాటు ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వామ్య (పీపీపీ) విధానం కింద ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు కూడా పిలిచారు. ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)టెండర్ దక్కించుకుంది. అయితే, సమస్య వచ్చింది. అయితే, తాను అనుకున్న ప్రైవేట్ సంస్థకు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఏఐకు టెండర్ పోవటంతో నాటి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు కు బ్రేకులు వేశారు. ఏరో సిటీ, ఎంఆర్ వో జత చేసి మళ్లీ టెండర్ పిలుస్తాం అంటూ అధికారుల సిఫారసులను బుట్టదాఖలు చేశారు. తన మోనార్కిజంతో బాబు భోగాపురం విమానాశ్రయం టెండర్ ను రద్దు చేసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టుకు బ్రేకులు వేశారు. ఆ తర్వాత జీఎంఆర్ సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకున్నా ....బాబు అవినీతి నేపథ్యంలో పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీఎంఆర్ కే ఈ ప్రాజెక్టు పనులు అప్పగించాలని జగన్ సర్కార్ సూత్రప్రాయ అంగీకారానికి వచ్చింది.
జీఎంఆర్ తో రాష్ట్ర్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏడీసీఎల్) చర్చలు జరుపుతోంది. విశాఖ రాజధాని ప్రకటన తర్వాత బోగాపురంపై జోరుగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి గత కేబినెట్ సమావేశంలో బోగాపురంపై ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం భావించింది. గత ప్రభుత్వ హయాంలో టెండర్లలోని షరతులు, ఒప్పందాలను ఏడీసీఎల్ పున:పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. అన్ని సవ్యంగా ఉంటే రాబోయే కేబినెట్ భేటీలో జీఎంఆర్ కు పనులు కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కాగా, నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయ పనులు దక్కించుకున్న టర్బో ఏవియేషన్ సంస్థకు అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. పనుల్లో జాప్యంపై వివరణ కోరారు. కొద్ది రోజులు వేచి చూసిన తర్వాత సరైన వివరణ ఇవ్వని నేపథ్యంలో ఈ సంస్థ కాంట్రాక్ట్ ను పున:పరిశీలించే యోచన లో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోపైపు రాబోయే మూడు నెలల్లోపు కర్నూలు జిల్లా ఓర్వ కల్లు విమానాశ్రయం నుంచి సేవలు ప్రారంభించే యోచన లో ఏడీసీఎల్ ఉంది.