త‌గ్గేదేలా.. జ‌గ్గారెడ్డి దారే వేర‌ప్పా!

Update: 2023-06-27 19:54 GMT
అంద‌రిదీ ఒక‌దారైతే.. ఉలిపిక‌ట్టెది మ‌రోదారి అన్న‌ట్టుగా ఉంది.. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జ‌గ్గారెడ్డిది .ఈయ‌న ఎమ్మెల్యే అన్న విష‌యం తెలిసిందే. అంతో ఇంతో పార్టీ విష‌యంలో ఆయ‌న‌ కు కొంతైనా నిబ‌ద్ధ‌త ఉంటుంది. కానీ, ఇప్పుడు ఎందుకో ఆయ‌న తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. ఆయ‌న చుట్టూ ఉన్న ప‌రిస్థితుల ను బ‌హుశ ఆయ‌న త‌ట్టుకోలేక పోతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ లో క‌ట్టుబాటు ఉందో లేదోన‌ ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

తాజాగా జ‌గ్గారెడ్డి మీడియా తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నేతల పైనే దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపరించిందన్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తానని అనుకోలేదని త‌న‌ ను తాను విమ‌ర్శించుకున్నారు.  పార్టీలో నాలుగేళ్ళ నుంచి తన పై ప్రచారం జరుగుతోందని... పార్టీ కోసం ఎంత చేసినా తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్‌ లో ఎందుకు ఈ పరిస్థితి ఉందో అర్థం కావడం లేదని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి అన్ని విషయాలు నిశితంగా వివరిస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికల వ్యూహాల పై రాహుల్ గాంధీ పిలిచార ని వివ‌రించారు. "నేను పైరవికారుణ్ణి కాదు.. వాళ్ళు పిలిస్తేనా వచ్చా. పార్టీ ఐక్యంగా ఉందో లేదో నేను చెప్పలేను... నేను చెప్పే వాడిని కూడా కాదు.. పార్టీ ఐక్యంగా ఉందో లేదో రాహుల్ గాంధీకి చెబుతా" అంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.  ఈ ప‌రిణామాల‌తో జ‌గ్గారెడ్డి దారి వేర‌ప్పా.. అనే కామెంట్లు కాంగ్రెస్‌ లోనే వినిపించాయి.

Similar News