తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

Update: 2020-10-13 11:54 GMT
గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు స్టడీగా కొనసాగుతున్నాయి. 2వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే పట్నాలు, పల్లెల్లో మాత్రం రోగుల సంఖ్య భారీగా ఉంటోంది. చాలా మంది సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు అంతా కరోనా బారినపడుతున్నారు.

ఇప్పటికే అధికారులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, మంత్రులకు కరోనా వైరస్ సోకుతూ వస్తోంది. తాజాగా తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది.

తాజాగా తెలంగాణలోని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవలే సంజయ్ ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలో సంజయ్ కు కరోనా సోకి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టెస్ట్ చేయించుకున్న సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన హైదరాబాద్ లోని తన ఇంట్లో హోం క్వారంటైన్ కు వెళ్లిపోయారు. రెండు రోజులుగా సంజయ్ పలువురు ప్రముఖులను కలిసినట్టు సమాచారం. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

ఇక తనను కలిసిన వారంతా విధిగా పరీక్ష చేయించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. ఇక తాజాగా తెలంగాణలో కొత్తగా 1708 కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Tags:    

Similar News