గుండు మీద జై శ్రీరాం... అసలు కథ ఇదే !

Update: 2020-07-21 00:30 GMT
అయోధ్యలో  అతి త్వరలోనే రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరగబోతుంది. ఈ తరుణంలోనే గత వారం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాముడు అసలు భారతీయుడు కాదు అని , మా నేపాలీ అని, అసలైన అయోధ్య నేపాల్‌ లో ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఈ ఘటన జరిగిన తరువాత యుపిలో ఓ వ్యక్తి పై దాడి ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అతడికి గుండు చేయించి ..ఆ గుండు పై  జై శ్రీ రాం అని రాసిన సంఘటన తెలిసిందే. అయితే, ఆ  వ్యక్తి నేపాల్ ‌కు చెందిన వ్యక్తి అని, స్థానికంగా ఉన్న విశ్వ హిందూ సేన అనే సంస్థ అలా చేసిందన, రాముడు గురించి నేపాల్ ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ఇలా చేశామంటూ ప్రకటించారు.

దీనిపై స్పందించిన నేపాల్‌ రాయబారి.. యూపీ సీఎం యోగీని ఆరా తీశారు. దీనిపై పూర్తి వివరాలు చెబుతామని సీఎం యోగీ నేపాల్‌ రాయబారికి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలిసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  గుండు చేయిచుకున్న వ్యక్తి అసలు నేపాల్‌ కు చెందినవాడు కాదు అని , అతడు స్థానిక వారణాసికి చెందిన వాడని తేలింది. అతడి వద్ద ఆధార్‌ కార్డు, ఇతర ఆధారాల ప్రకారం భారతీయుడేనని తేలింది. అయితే ఇలా చేస్తే రూ.1000/- ఇస్తామని చెబితే ఇలా నేపాలీ అంటూ నాటకమాడాడని పోలీస్ విచారణలో తేలింది.

ఈ ఘటనకి  సంబంధించి ఆరుగురు వ్యక్తుల్ని అరెస్ల్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని కూడా గుర్తించామని.. వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News