స్పెషల్ స్టేటస్ పై ఒకవైపు ఏపీలో ఆగ్రహావేశాలు చెలరేగిపోతోంటే బీజేపీ నేతలు కొత్త రూపంలో ముందుకు వెళుతున్నారు. ఒకవైపు అసలు ప్రత్యేక హోదా డిమాండ్ లేదనే ప్రకటన చేస్తూ....మరోవైపు ప్యాకేజీతో సరిపుచ్చి హోదా లేదని తేల్చిచెప్పిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి సన్మానం చేసే పనిలో పడ్డారు.
విజయవాడలోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలని ప్రజల్లో లేదని చెప్పారు. అయినప్పటికీ దానిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. హోదా రానందుకు బాధ పడాల్సిన పనిలేదని, కేంద్రం అంతకంటే ఎక్కువే ఇస్తోందని కిశోర్ అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పట్టించుకోని ప్రతిపక్షాలు ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాల్సిన ప్రతిపక్షాలు ప్రజల్లో లేని హోదాను తెచ్చి ప్రచారం చేస్తున్నాయని కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
మరోవైపు ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ ఏపీ బీజేపీ నేతలు కలిసి ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి శాలువాతో సత్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు - ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ - పలువురు రాష్ట్రనేతలు జైట్లీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజీ ప్రకటించడం సంతోషకరమని వారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్యాకేజీ దోహదపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.