భూదందాల కోసమే రాజధాని తరలింపు !

Update: 2020-01-23 07:37 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాతో పవన్‌ భేటీ అయ్యారు. ఏపీలో ఇరుపార్టీల కార్యాచరణ పై సమావేశం లో నిశితంగా చర్చినట్టు తెలుస్తుంది. ఏపీలో రెండు పార్టీలు కలిసి చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణ గురించి జేపీ నడ్డాకు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఇకపోతే ఈ భేటీ తరువాత పవన్ మీడియా తో మాట్లాడుతూ ..వైసీపీ ప్రభుత్వం పై పలు సంచలన ఆరోపణలు చేసారు.

కేంద్రం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామన్న వైసీపీ వాదనలో అసలు ఇసుమంతైనా నిజం లేదని, ఈ విషయాన్ని కేంద్రం తనకు స్పష్టం చేసిందని పవన్ చెప్పారు. రాజధాని తరలింపు అంశం పై ప్రధాని నరేంద్ర మోదీ తో గానీ, హోంమంత్రి అమిత్ షాతోగానీ, వైసీపీ నేతలు చర్చించలేదని తెలిపారు. కేంద్రం అనుమతితోనే వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చామన్న వైసీపీ అవాస్తవ , రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారని , ఆ ప్రచారాన్ని జనసేన, బీజేపీ ప్రతినిధులు తిప్పికొట్టాలని పవన్ పిలుపునిచ్చారు. భూదందాల కోసమే వైసీపీ మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. పవన్‌కల్యాణ్‌  ఢిల్లీ కి వెళ్లే ముందు రాజధాని గ్రామాల రైతులను కలుసుకున్నారు. ప్రజా రాజధాని కోసం నాడు భూములిచ్చామని.. నేడు తమను అన్యాయం చేస్తున్నారని మహిళా రైతులు జనసేనాని ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాజధాని రైతుల ఆవేదనను విన్న పవన్ అండగా ఉంటానని.. కేంద్రంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. పవన్ దీనిపై కేంద్రం తో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలోనే అమరావతి రైతులకు మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న విజయవాడ లో లాంగ్ మార్చ్ నిర్వహించాలని జనసేన , బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
Tags:    

Similar News