నసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ కు రాజకీయ పరిపక్వత లేదని పలువురు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో పార్ట్ టైం పొలిటిషియన్ గా ఉన్న పవన్ ఈ మధ్య ఫుల్ టైం పొలిటిషియన్ గా మారారని - కానీ, ఇంకా పరిణతి లేని వ్యాఖ్యలను చేస్తున్నారని మిగతాపార్టీల నేతలు సెటైర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, వీటితో పాటు పొత్తుల విషయంలో కూడా పవన్ కు క్లారిటీ లేదని విమర్శలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం వామపక్షాలతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన పవన్....సడెన్ గా కటీఫ్ చెప్పేశారు. ఇక తాజాగా, తాను ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం లేదని పవన్ స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. జనసేనకు ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదని - తమ పార్టీ బలం జనం బలం చూపిద్దాం అని పవన్ ఉద్వేగభరితంగా ట్వీట్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో సీపీఐ - సీపీఎంలతో సహా మరే పార్టీతోనూ పొత్తులుండవని పవన్ స్పష్టమైన ప్రకటన చేశారు. తాము ఎవరితోకా పట్టుకుని ఎన్నికల బరిలో దిగబోమని జనసేనాని ట్వీట్ చేశారు. ఫలానా పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయని - ఎవరితోనూ కలవాల్సిన అవసరం తమకు లేదని పవన్ అన్నారు. మన బలం... జనం.... చూపిద్దాం....ప్రభంజనం అంటూ ట్వీట్ చేశారు. ఎప్పటిలాగే పవన్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు బాగానే ఉంది. అయితే, తనను చూడడానికి వచ్చిన వారంతా ఓట్లు వేస్తారని అనుకోవడం లేదని పవన్ స్వయంగా అన్నారు. ఈ క్రమంలోనే వామపక్షాలతో పొత్తు పొడిపించాలనుకున్నారు. కానీ, ఆ పొత్తుతో పెద్దగా ఉపయోగం లేదని పవన్ భావించి...ఆ ఆలోచన విరమించుకున్నట్లు కనిపిస్తోంది. ఇక మరో ప్రధాన పార్టీతో పొత్తుకు పవన్ తహతహలాడినా....అవతలి పార్టీ అధినేత సుముఖంగా లేకపోవడంతో పవన్ ఖంగుతిన్నారని టాక్. తాజాగా, బీఎస్పీతో పొత్తు కోసం పవన్ ఆరాటపడ్డా...ఏపీ - టీఎస్ లో ఆ పార్టీతో పొత్తు వల్ల పెద్ద ఫలితం లేదని పవన్ కు అర్థమైంది. అందుకే...సింహం సింగిల్ గా వస్తుందని రజనీ చెప్పిన తరహాలో సింగిల్ గానే ఎన్నికల బరిలో దిగాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్లున్నారు. అయితే, ఈ మాట మీద పవన్ ఎంతవరకు నిలబడతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!