రాజకీయాల్లో తనతో కలిసి వచ్చే నేతలను గుర్తించేందుకు కొత్త తరహా విధానం ద్వారా ముందుకు సాగుతున్న జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ముందడుగు వేశారు. ఇప్పటివరకు మొదటి దశలో అనంతపురం జిల్లా జనసేన సైనికులను ఎంపిక చేసి వారిని స్వయంగా కలిసిన పవన్ తదుపరి దశలో ఉత్తరాంధ్ర షెడ్యూల్ ఖరారు చేశారు. విజయనగరం లో జరిగే జనసేన గుర్తింపు శిబిరం ఈ నెల 20 - 21 లో జరుగుతుందని జనసేన పార్టీ తెలిపింది. స్పీకర్స్ - అనలిస్ట్స్ - కంటెంట్ రైటర్స్ గా సేవలు అందించడానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా విజయనగరం నుంచి 2000 దరఖాస్తులు అందాయని వివరించింది.
రాజకీయాల్లో యువకులు - మేధావులను భాగస్వామ్యుల్ని చేయాలన్న తన ఆలోచనకు జనసేన సైనికులు అందిస్తున్న సహకారం చాలా విలువయినదిగా భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జనసేన సైనికులను యూత్ హాస్టల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కాణిపాక ఎలిమెంట్రీ స్కూల్ ప్రక్కన వార్డ్ నెంబర్:29, విజయనగరంలో ఈ నెల 20 - 21వ తేదీన ఎంపిక చేయనున్నట్లు వివరించారు.
కాగా ఉత్తరాంధ్ర తదుపరి గ్రేటర్ హైదరాబాద్ లో జనసేన గుర్తింపు శిబిరాలు ఉంటాయి. ఈనెల 23 - 24 - 25 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఈ శిబిరాలు జరుగుతాయి. స్పీకర్స్ (వక్త) - అనలిస్ట్ కంటెంట్ రైటర్స్ గా సేవలు అందించడానికి దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం ఉత్తరాంధ్ర నుంచి 6000, గ్రేటర్ హైదరాబాద్ నుంచి 4500 దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా జనసేన పరిపాలన కార్యాలయానికి అందాయని ఇటీవల ఒక ప్రకటనలో జనసేన తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/