ఇదేం వ్యూహం.. దీంతో జ‌న‌సేన పుంజుకునేనా?

Update: 2023-02-13 14:48 GMT
వచ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తాను.. వైసీపీ నేత‌ల‌ను శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టిస్తాను.. వైసీపీ హ‌టావో.. నినాదంతో చెల‌రేగుతాను.. అని ప‌దే ప‌దే చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అండ్ కోలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. చూస్తే.. ఇవ‌న్నీ.. సాకారం అయ్యేనా..? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం.. ఏ పార్టీ అయినా.. నాయ‌కులు లేనిదే.. బ‌లోపేతం కాదు. క్షేత్ర‌స్థాయిలో జెండాలు మోసేవారు.. నినాదాలు చేసేవారే కాదు.. నాయ‌క‌త్వం కూడా అంతే ముఖ్యం.

అయితే.. ఈచిన్న లాజిక్‌ను జ‌న‌సేన ఎక్క‌డో మిస్స‌యిపోతోంది. ఉన్న‌నాయ‌కులు ఊడిపోతున్నారు. మ‌రోవైపు కొత్త‌గా చేరేందుకు రెడీగా ఉన్నామ‌ని సంకేతాలు ఇస్తున్న‌వారిని కూడా ఆక‌ర్షించే ప‌రిస్థితి జ‌న‌సేన‌లో క‌నిపించ‌డం లేదు. దీంతో ఇదేం వ్యూహం.. దీంతంఓ జ‌న‌సేన పుంజుకునేనా.. అధికారంలోకి వ‌చ్చేనా? అనే సందేహాలు.. ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి.

అస‌లు ఏం జ‌రిగింది...

గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ త‌ర్వాత జ‌న‌సేన‌కు దూర‌మ‌య్యారు. కానీ, ఇటీవ‌ల ఆయ‌న సంకేతాలు ఇచ్చారు. తిరిగి జ‌న‌సేన‌లోకి చేరుతాన‌ని చెప్ప‌క‌నే ఆయ‌న చెప్పారు. ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్‌ను పొగిడారు. అయినా... పార్టీ ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో ఆయ‌న ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్ర‌క‌టించారు. ఇక‌, ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన మ‌హాసేన రాజేష్ కూడా తాను రాజ‌కీయంగా వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు.

అంతేకాదు.. తాను ప‌వ‌న్‌కు వీరాభిమానిన‌న్నారు. కానీ, ఈయ‌న‌ను కూడా జ‌న‌సేన ప‌ట్టించుకోలేదు. దీంతో టీడీపీ లౌక్యంగా వ్య‌వ‌హ‌రించి.. మ‌హాసేన రాజేష్‌ను త‌న‌వైపు తిప్పుకొంది. వెంట‌నే ఆయ‌న టీడీపీలో చేరిపోయారు. ఇదిలావుంటే.. ఉన్న నేత‌ల‌ను కూడా జ‌న‌సేన కాపాడుకోలేక పోతోంది. తాజాగా జనసేన పార్టీ నుంచి కేతంరెడ్డి వినోద్ రెడ్డి అనే నెల్లూరు నేతను సస్పెండ్ చేశారు.

నియోజకవర్గ ఇంచార్జ్ ను జిల్లా అధ్యక్షుడు సస్పెండ్ చేసేశారు. దీనిపై జనసేన అగ్రనేతలు ఎవరూ స్పందించలేదు. దీంతో అసలు జనసేనలో ఏం జరుగుతోందన్న చర్చ జన సైనికుల్లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారు ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌డం లేదు. మ‌రి ఉన్న‌వారిని, వ‌స్తామ‌ని చెబుతున్న‌వారిని, చేరుతామ‌ని సంకేతాలు ఇస్తున్న వారిని క‌కూడాపార్టీ ప‌ట్టించుకోకుండా వ్య‌వ‌హ‌రించ‌డం ఏమ‌రేకు పార్టీ వ్యూహ‌మో అర్ధం కావ‌డం ల‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Similar News