మ‌న ఆశ‌లు ఆవిరి.. ఇక‌, జ‌న‌సేన అంతే... కాపు నేత‌ల్లో హాట్ టాపిక్‌..!

Update: 2023-05-22 23:00 GMT
''అవును. ఇక‌, ఆ పార్టీ అంతే.. మా నాయ‌కుడు అంతే'' ఇదీ.. ఇప్పుడు కాపు నేత‌ల మ‌ద్య జ‌రుగుతున్న కీల‌క చ‌ర్చ‌. ''వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిని చేయాల‌ని మేమంతా ఎంతో ఆశ పెట్టుకున్నాం. కానీ, ఆదిశ‌గా మానాయ‌కుడు న‌డవ‌డం లేదు. మ‌మ్మ‌ల్ని న‌డిపించ‌డ‌మూ లేదు. మాదొక త్రిశంకు స్వ‌ర్గంలో ఉన్న‌ట్టుగా ఉంది'' అని కాపు నాయ‌కులు చెబుతున్నారు. తాజాగా రెండు రోజుల కింద‌ట‌.. విజ‌య‌వాడ‌లోని కాపు నాయ‌కుడి ఇంట్లో జ‌రిగిన భేటీ కాపులు చ‌ర్చించారు.

జ‌న‌సేన ను బ‌లోపేతం చేయాల‌ని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని.. గ‌తంలోనే చేసిన తీర్మానంపై వారు చ‌ర్చించ‌న‌ట్టు తెలిసింది. అయితే.. త‌మ తీర్మానాల‌కు.. పార్టీ లైన్‌కు మ‌ధ్య సంబంధం లేకుండా పోయింద‌ని మెజారిటీ నాయ‌కులు చెబుతున్నారు. ''పార్టీ ఏదైనా మేం ఉన్నాం.. అంటే.. మ‌మ్మ‌ల్ని న‌డిపించాలి.

కానీ.. మేం న‌డుస్తాం అన్నా కూడా.. వెన‌క్కి నెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఏం చెప్పాలి'' అని కీల‌క నాయ‌కుడు ఒక‌రు పేరు చెప్ప‌డానికి ఇష్ట‌పడ‌ని నాయ‌కుడు వ్యాఖ్యానించారు.

2014లోనే తాము ఆశ‌లు పెట్టుకున్నామ‌ని.. 2019లో త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్లు వేశామ‌ని..అయితే.. అప్ప‌ట్లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయ‌మ‌ని.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉండ‌డం.. ప్ర‌భుత్వంపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డం.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం వంటివాటితోపాటు.. కౌలు రైతుల కుటుంబాల‌ను ఆదుకోవ‌డం.. వంటివి పార్టీకి ప్ల‌స్సులుగా ఉన్నాయ‌ని..ఈ  నేప‌థ్యంలో ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్రొజెక్టు చేస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని భావిస్తున్నామ‌ని వారు చెబుతున్నారు.

అయితే.. పార్టీ అధినాయ‌క‌త్వం మాత్రం దీనికి బిన్నంగా అడుగులు వేస్తోంద‌ని.. అందుకే.. ఇప్పుడు ఏం చేయాలో త‌మ‌కు అర్ధం కావ‌డం లేద‌ని.. మెజారిటీ కాపు నాయ‌కులు వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన ప‌రిస్థితి 2014-2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలా ఉందో అలానే ఉంద‌ని చెబుతున్నారు.

ఒక జెండా మోసే నాయ‌కుడు లేర‌ని.. గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకును సొంతం చేసుకునే వ్యూహాలు కూడా క‌నిపించ‌డం లేద‌ని.. మ‌రి ఏం చేస్తారో..కూడా చెప్ప‌డం లేద‌ని అంటున్నారు. మొత్తంగా కూడా.. కాపు నాయకుల్లో ఆశ‌లు ఆవిరి అయిన‌ట్టుగా క‌నిపిస్తుండడం గ‌మ‌నార్హం.

Similar News