జోహార్ పవన్ కళ్యాణ్.. రచ్చ రచ్చ

Update: 2018-03-23 05:04 GMT
పవన్ కళ్యాణ్ అభిమానులు తప్పులో కాలేశారు. తమ నాయకుడిని కీర్తించే క్రమంలో నోరు జారారు. జోహార్ పవన్ కళ్యాణ్ జోహార్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశాడు ఓ అభిమాని. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అందులో కొందరు పవన్ ను మహాత్మాగాంధీతో పోలుస్తూ నినాదాలు చేశారు. కొందరు జై పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక అభిమాని అత్యుత్సాహం ‘జోహార్ పవన్ కళ్యాణ్’ అన్నాడు. జోహార్.. అమర్ రహే లాంటి నినాదాలు చనిపోయిన వారికి ఉపయోగిస్తారన్న తెలివి ఆ అభిమానికి లేకపోయింది.

మామూలుగానే పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కత్తి మహేష్ లాంటి వాళ్లు నిరక్ష్యరాస్యులని.. మూర్ఖులని విమర్శిస్తుంటారు. ఇక ఇలాంటి వీడియోలు బయటికి వస్తే ఊరుకుంటారా? వెంటనే కత్తి మహేష్ స్పందించాడు. జోహార్ పవన్ కళ్యాణ్ ఏంట్రా అని కామెంట్ చేస్తూ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మరోవైపు మహేష్ కత్తి తెలుగుదేశం పార్టీ మీద కూడా దాడిని కొనసాగించాడు. ‘’గ్లోబల్ టెర్రర్  విషయంలో అమెరికా అందరినీ భపెట్టింది. మీరు మాతో కలిసి రాకపోతే మిమ్మల్ని కూడా టెర్రరిస్టులుగా పరిగణిస్తాం అనే పద్ధతిని తెలుగుదేశం అవలంభిస్తోంది. మాతో లేకపోతే మీరు బీజేపీ ఏజెంట్లు అని. బీజేపీతో వ్యభిచారం చేసింది మీరు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను.. జగన్ ను అంటే ఎట్టా”” అని మహేష్ ప్రశ్నించాడు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News