ఇసుక కోసం మంత్రి ఇంటిని ముట్టడించిన జనసేన!

Update: 2019-10-26 10:05 GMT
ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. దీనితో కార్మికులు పనిలేక పొట్ట కూటికోసం ఉన్న చోటునుండి ఇంకో చోటుకి వలసవెళ్తున్నారు. మరికొంతమంది ఆకలితో అల్లాడుతున్నారు. ఇసుక కొరత తీవ్రంగా ఉన్న నేపధ్యంలో నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారని ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెట్టినప్పటికీ  ఏపీలో ఇసుక మాత్రం కనిపించడంలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషంపై తాజాగా జనసేన స్పందించింది. ఇసుక కొరతకు నిరసనగా  భవన నిర్మాణ కార్మికులతో కలసి జనసేన నేతలు ఆందోళన బాట పట్టారు. విశాఖలోని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వ అసమర్ధతతో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు. కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ ,  ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని నినాదాలు చేసారు.  

ఇక ఆ తరువాత  కార్మికులు తమ కష్టాలను మంత్రికి వివరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆకలి కేకలు వేస్తున్నామని మంత్రికి తమ బాధలని చెప్పుకున్నారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ..ప్రభుత్వం ఇసుక కొరతకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తుందని, వీలైనంత త్వరగా కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని, రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాయని విమర్శించారు
Tags:    

Similar News