జ‌న‌సేన‌.. పూర్తిగా నాదెండ్ల సొంతం అవుతోందా?

Update: 2020-03-09 05:52 GMT
జ‌న‌సేన‌కు సంబంధించిన వార్త‌ల్లో కూడా ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌న్నా ఎక్కువ ప్రాధాన్య‌త‌ను పొందుతున్న‌ట్టుగా ఉన్నాడు ఆ పార్టీ పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్. జ‌న‌సేన‌లో నాదెండ్ల మ‌నోహ‌ర్ ప‌ద‌వి, హోదా గురించి బ‌య‌టి వాళ్ల‌కు పెద్ద‌గా అర్థం కాదు. అయితే ఇప్పుడు జ‌న‌సేన అంటే నాదెండ్ల‌, నాదెండ్ల అంటే జ‌న‌సేన అన్న‌ట్టుగా మారింది వ్య‌వ‌హారం. ప్ర‌త్యేకించి ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాకా జ‌న‌సేన పాలిట వ‌న్ మ్యాన్ ఆర్మీగా మారాడు నాదెండ్ల మ‌నోహ‌ర్.

పార్టీ క్రియాశీల ప్రోగ్రామ్స్ లో అంత‌టా నాదెండ్లే క‌నిపిస్తూ ఉన్నారు. పార్టీ త‌ర‌ఫున ప్ర‌క‌ట‌న‌లు ఆయ‌నే చేస్తూ ఉన్నారు. పొత్తుల సీట్లూ ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే ఖ‌రారు అవుతున్నాయి. పార్టీ త‌ర‌ఫున మ‌హిళా దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తే.. ఆ కార్య‌క్ర‌మంలో కూడా నాదెండ్లే ముఖ్య నేత‌గా క‌నిపించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కేవ‌లం ట్విట‌ర్ లో విషెస్ కు ప‌రిమితం అయితే నాదెండ్ల త‌నే పార్టీ అధినేత అనేంత‌లా ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మంలోనే కాకుండా..అంత‌టా నాదెండ్లే క‌నిపిస్తూ ఉన్నారు!

సాధార‌ణంగా ఒక పార్టీ త‌ర‌ఫున మ‌రీ ఇన్ని వ్య‌వ‌హారాల్లో పాలు పంచుకునేది ఎవ‌ర‌య్యా అంటే.. ఆ పార్టీ అధినేతే! ఒక‌వేళ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌తో బిజీగా ఉండి ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌క‌పోవ‌చ్చు గాక‌, అలాంట‌ప్పుడు.. ప్ర‌త్యామ్నాయం అంటూ కొంత‌మంది ఉండాలి! పార్టీ అంటే.. వ‌న్ మ్యాన్ ఆర్మీ కాదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి సినీ హీరో కూడా ఒంట‌రిగా పార్టీని విజ‌య‌వంతం చేయ‌లేక‌పోయాడు. పార్టీ అంటూ టీమ్ వ‌ర్క్. సోనియాగాంధీ కూడా ఒంట‌రిగా నిర్ణ‌యాలు తీసుకునేది కాదు. త‌న కంటూ ఒక టీమ్ పెట్టుకునేది. అయితే జ‌న‌సేన‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లోకి వెళ్లిపోయాకా కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ టీమ్ ఏర్ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం!

మొన్న‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌న్ మ్యాన్ ఆర్మీ. ఇప్ప‌డు ఎలాంటి గుర్తింపు లేని నాదెండ్ల మ‌నోహ‌ర్ వ‌న్ మ్యాన్ ఆర్మీ లా క‌నిపిస్తున్నారు. జ‌న‌సేన ఇంత‌కీ ఎప్ప‌టికి పార్టీ రూపం సంత‌రించుకుంటుంది? అనేది మాత్రం అంతుబ‌ట్ట‌ని ప్ర‌శ్న‌గానే మిగిలింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


Tags:    

Similar News