టీవీ9ను టార్గెట్ చేసి జనసేన ఫ్యాన్స్

Update: 2020-09-07 09:31 GMT
తెలుగు టాప్ న్యూస్ చానెల్ టీవీ9ను జనసేన టార్గెట్ చేసింది. ట్విట్టర్ లో ఇప్పుడు #Shamelesstv9ను జనసేన ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ టీవీ9పై జనసేన ఫ్యాన్స్ కు ఎందుకు కోపం వచ్చిందనేది ఆసక్తిగా మారింది.

అసలు విషయానికి వస్తే.. హీరోయిన్ మాధవీలత ఇటీవల పవన్ కళ్యాణ్ కు రాసిన ఒక బహిరంగ లేఖ సంచలనం సృష్టించింది.పవన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో తనను విష్ చేసిన అందరినీ పేరుపేరునా థ్యాంక్స్ చెబుతున్నారు. అయితే అలా చెప్పడం తనకు నచ్చలేదని చెబుతూ హీరోయిన్ మాధవీలత తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టింది.

ఈ విషయాన్ని అందరూ లైట్ తీసుకున్నా ప్రముఖ చానల్ టీవీ9 సీరియస్ గా తీసుకొని వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ విషయం మీద పవన్ ఏమీ స్పందించలేదు.

కానీ జనసేన పార్టీ తరుఫున ఒక ప్రకటన విడుదలైంది. టీవీ9 కథనాల వల్ల జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వారందరూ సంయమనం పాటించాలని కోరారు.

ఇక ఎప్పుడైతే ఆ లేఖ విడుదల అయ్యిందో ఇక పవన్ ఫ్యాన్స్ ఆ చానెల్ మీద ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు #Shamelesstv9ను జనసేన ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News