ఉత్తరాంధ్రా జిల్లాలు ఇపుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకం అవుతున్నాయి. ఇక్కడ మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో ఎవరైతే మెజారిటీ సీట్లు దక్కించుకుంటారో వారిదే ఏపీలో అధికారం. ఇది 2014లో రుజువు అయింది. 2019లో కూడా అయింది. 2014లో పాతికకు పైగా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఇక 2019లో వైసీపీ గాలి గట్టిగా వీచింది. దాంతో 28 సీట్లు గెలుచుకుని జెండా పాతేసింది.
ఇపుడు చూస్తే మళ్లీ ఆ మ్యాజిక్ వైసీపీకి సాధ్యమేనా అంటే డౌటే కొడుతుంది అని అంటున్నారు. 2019లో విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి పారేసింది వైసీపీ. 2024లో అలా కుదురుతుందా అంటే నో అనే చెప్పాలి. ఉమ్మడి అలాగే శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లు ఉంటే అందులో రెండు టీడీపీ గెలుచుకుంది. మిగిలినవి అన్నీ వైసీపీ ఖాతాలో పడిపోయాయి.
విశాఖలో 15 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 11 వైసీపీ గెలుచుకుంది. ఇలా ఎక్కడ చూసినా నాడు వైసీపీ హవా సాగింది. ఈ నేపధ్యంలో 2024లో వైసీపీకి 28 సీట్లు కాదు కానీ మెజారిటీ సీట్లు వస్తాయా అన్న చర్చ ఉంది. అంటే 20కి పైగా సీట్లు తెచ్చుకున్నా వైసీపీ హిట్ అయినట్లే. కానీ చూడబోతే రాజకీయ సామాజిక పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి.
గతంలోనే బలంగా ఉన్న తెలుగుదేశం మరోసారి తన కంచుకోటలను కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతోంది. ఆ పార్టీ ఉత్తరాంధ్రా మీద ఫోకస్ పెట్టింది. అయితే గతంలో మాదిరిగా తెలుగుదేశానికి పూర్తిగా అనుకూల వాతావరణం అయితే లేదు అంటున్నారు. నాయకులు కూడా చాలా చోట్ల సైలెంట్ అవుతున్నారు. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయి. వర్గ పోరు ఉంది.
దాంతో ఎంతలా చంద్రబాబు కష్టపడుతున్న అనుకున్న ఊపు అయితే తీసుకురాలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన ఉత్తరాంధ్రా మీద ఫోకస్ పెట్టేసింది. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే రేపటి రోజున అధికారంలో తామే కీలకంగా మారుతామని భావిస్తోంది. సగానికి సగం సీట్లు గెలుచుకోవడానికి జనసేన స్కెచ్ వేస్తోంది.
ఉత్తరాంధ్రా జిల్లాలలో తూర్పు కాపులు అధికంగా ఉన్నారు. వారు ఇక్కడ బీసీలుగా చలామణీ అవుతారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వీరి హవా ఎక్కువ. మొత్తం 12 నియోజకవర్గాలలో వీరి ప్రభావం గట్టిగా ఉంటుంది. అదే విశాఖ జిల్లాలో చూస్తే ఓసీ కాపులు ఉంటారు. వీరు కూడా ఇపుడు జనసేన వైపు చూస్తున్నారు. దాంతో గుర్తించిన సీట్లలో తమ బలాన్ని జనసేన పెంచుకుంటోంది అని అంటున్నారు.
విశాఖ నార్త్, గాజువాక, భీమిలీ, ఎలమంచిలి, అనకాపల్లి. చోడవరం, పాయకరావుపేటలలో తాము కచ్చితంగా గెలుస్తామని జనసేన అంచనా వేసుకుంటోంది. పొత్తులో కూడా ఈ సీట్లను డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా విజయనగరంలో చూస్తే ఎస్ కోట, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం సీట్ల మీద జనసేన పాగా వేయాలని చూస్తోంది. ఇక్కడ తూర్పు కాపుల బలం చాలా ఎక్కువ.
శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పాతపట్నం లలో పాగా వేయాలని జనసేన లెక్క కట్టి మరీ పక్కా ప్లానింగ్ తో ముందుకు పోతోంది. అంటే మొత్తంగా పదిహేను సీట్లలో జనసేన కనుక గెలుపు దిశగా అడుగులు వేస్తే ఏపీ రాజకీయాల్లో తామే రేపటి రోజున అత్యంత కీలకం అవుతామని అంచనా కడుతోంది. ఈ సీట్లను పొత్తులో భాగంగా తెలుగుదేశాన్ని అడగాలని భావిస్తోంది.
చిత్రమేంటి అంటే ఈ సీట్లలో తెలుగుదేశానికి కూడా గట్టి పట్టు ఉంది. పైగా దశాబ్దాలుగా పాతుకుపోయిన నాయకులు చాలా మంది ఉన్నారు. వారంతా కూడా సీట్లు త్యాగం చేసేందుకు ఒప్పుకోరు అని అంటున్నారు. అయితే వత్తిడి తెచ్చి మరీ తెలుగుదేశం నుంచి ఈ సీట్లు సాధిస్తే తాము కచ్చితంగా గెలవడమే కాకుండా అధికారంలో వాటాను డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంటామని జనసేన భావిస్తోంది. మరి ఉత్తరాంధ్రా మీద ఇంతలా పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టడం వెనక ఇంత కధ ఉంది అన్న మాట.